వెనక్కి తగ్గిన రవితేజ...అందుకేనా...

వరుస పరాజయాల తర్వాత మంచి హిట్ కోసం మొహం వాచి ఉన్న రవితేజ వీఐ ఆనంద్ దర్శకత్వంలో డిస్కోరాజా అనే సినిమా చేస్తున్నాడు. సైన్స్ ఫిక్షన్ అండ్ పిరియాడిక్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో రవితేజ తండ్రీ, కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. నభా నటేశ్, పాయల్ రాజ్పుత్, తాన్యా హోప్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో ప్రముఖ తమిళ నటుడు బాబీ సింహా విలన్ గా కనిపించనున్నాడు. ఇక నిన్న బాబీ సింహా బర్త్డే సందర్భంగా విషెస్ తెలుపుతూ ‘డిస్కోరాజా’లో ఆయన లుక్ రిలీజ్ చేసింది మూవీ టీమ్. ఈ సినిమాలో బాబీ సింహా ‘బర్మా సేతు’ అనే క్యారెక్టర్ చేస్తున్నాడు. మంచి సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో ఉన్న బాబీ లుక్ ఆకట్టుకుంటోంది. నిజానికి ఈ సినిమాని డిసెంబర్ 20,2019న విడుదల చేయనున్నట్టు నిర్మాతలు వినాయక చవితి నాడు ప్రకటించారు. ఈ సినిమా ప్రేక్షకులకి మంచి వినోదం అందించడం ఖాయమని అప్పట్లో భరోసా కూడా వ్యక్తం చేశారు. ఈ సినిమాని ఎస్.ఆర్.టి. ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద రామ్ తాళ్లూరి నిర్మించనున్నారు. . ప్రస్తుతం చివరి దశ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం లేదని సమాచారం. అనుకున్న డేట్ కే పోటీ మరింత తీవ్రం కావడంతో ఈ టీమ్ వెనక్కి తగ్గినట్టు సమాచారం. ఇక ఈ సినిమా జనవరి 24న రిలీజ్ చేస్తున్నామని కొద్ది సేపటి క్రితమే నిర్మాతలు ప్రకటించారు.