English   

రానాతో రకుల్ ఎఫైర్.. అమ్మడు ఇచ్చిన క్లారిటీ ఇదే..

rakul
2019-11-07 19:14:02

తెలుగు ఇండస్ట్రీలో ఎపైర్లు కొత్తేం కాదు. ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు ఎఫైర్లు మెయింటేన్ చేస్తూనే ఉంటారు. ఇఫ్పుడు కూడా ఇదే జరుగుతుంది. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ కూడా రానా దగ్గుబాటితో ఎఫైర్ నడిపిస్తుందనే వార్తలు వచ్చాయి. ఒకప్పుడు చిన్న హీరోలతో నటించి ఆ తర్వాత స్టార్ అయిపోయింది రకుల్. ఇప్పుడు స్టార్ హీరోలు తప్ప చిన్న హీరోల వైపు కనీసం కన్నెత్తి కూడా చూడటం లేదు. సినిమాలతో పాటు వివాదాలు కూడా ఈ భామకు కొత్త కాదు. ఓ వైపు సినిమాలు.. మరోవైపు బిజినెస్ లు చేస్తూ దూసుకుపోతున్న రకుల్ పై ఇప్పుడు రానాతో ఎఫైర్ అంటూ కొత్త వార్తలు పుట్టుకొచ్చాయి. 

దీనిపై అమ్మడు ఫుల్ క్లారిటీ కూడా ఇచ్చేసింది. రానాతో నేను డేటింగ్ లో ఉన్నట్లు వస్తోన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు.. మా మధ్య ఉన్నది కేవల స్నేహాం మాత్రమే.. దీనికే డేటింగ్ అని పేరు మాత్రం పెట్టొద్దు అంటూ క్లారిటీ ఇచ్చేసింది రకుల్. అసలు విషయం ఏంటంటే.. రానా, తాను పక్క పక్క ఇళ్లలోనే ఉంటామని.. అలా తమ మధ్య క్లోజ్ నెస్ పెరిగిపోయిందని చెప్పింది ఈమె. అందుకే తమ మధ్య ఏదో ఉందనే టాక్ బయటికి వచ్చింది కానీ నిజానికి తాము మంచి స్నేహితులం అని చెబుతుంది ఈ బ్యూటీ. అవునా.. అయ్యో పాపం మాకు తెలియదే అంటూ నెటిజన్లు కూడా దీనిపై సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు.

More Related Stories