English   

బాలయ్యను దారుణంగా అవమానించిన కమెడియన్.. ఫ్యాన్స్ ఫైర్..

nbk
2019-11-08 08:40:03

బాలయ్యను ఎవరైనా ఏదైన మాట అనాలంటే భయపడతారు. ఎందుకంటే ఆయనకు ఉన్న మాస్ ఫాలోయింగ్ అలా ఉంటుంది మరి. అందుకే బాలయ్యను ఒక్క మాట అనాలంటే కూడా ఆలోచిస్తారు. కానీ ఓ కమెడియన్ మాత్రం దారుణంగా అవమానించాడు. మాటలతోనే మర్డర్ చేసాడు. అంత ధైర్యం ఎవరికి ఉంది అనుకుంటున్నారా..? తమిళ కమెడియన్ ఒకరు ఇప్పుడు బాలయ్యపై చేసిన ఓ స్పూఫ్ కామెడీ నవ్వుతో పాటు కోపం కూడా తెప్పిస్తుంది. ముఖ్యంగా ఆయన డాన్సులపై కూడా నోరు పారేసుకున్నాడు ఆ కమెడియన్. అంతగా కామెడీ చేసిన ఆయన పేరు అలెగ్జాండర్‌ బాబు.. తమిళనాట మనోడికి మంచి ఫాలోయింగ్ ఉంది. ఇండియాస్ బెస్ట్ స్టాండప్స్ లో ఈయన కూడా ఒకరు. అందుకే బాబు ఏం చేసినా కూడా నవ్వు ఖాయం. ఇప్పుడు కూడా కేజే యేసుదాస్ సహా ఎస్పీబీపై కామెడీ చేసాడు. లెజెండరీ సింగర్స్‌ను తీసుకుని అందులోనే తన కామెడీ సృష్టించాడు అలెగ్జాండర్.

మాటలకు కాస్త చతురత.. ఇంకాస్త వ్యంగ్యాన్ని జోడించి కామెడీ చేస్తుంటాడు అలెగ్జాండర్ బాబు. గాయకుల గురించి చెబుతూ అందులో నటించిన హీరోలను కూడా టార్గెట్ చేసాడు బాబు. అక్కడే మన బాలయ్యను కూడా టచ్ చేసి అనవసరంగా దొరికిపోయాడు. ఈయన డాన్సులు చూస్తే మిడ్‌నైట్‌ మసాలా హీరోయిన్లు కూడా భయపడి పారిపోతారంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు. ఇది చూసి అభిమానులకు ఒళ్లు మండిపోతుంది. డాన్స్ మాస్టర్లు చెప్పింది కాకుండా సొంత స్టెప్పులు వేసి హీరోయిన్లను భయపెడుతుంటాడు అంటూ రెచ్చిపోయాడు. ఎన్నో రాత్రులు వస్తాయి కానీ అనే పాటను తీసుకుని ఖూనీ చేసాడంటూ బాలయ్యపై సెటైర్లు వేసాడు. ఇది చూసిన తర్వాత నీ అడ్రస్ చెప్పరా.. బాలయ్య డాన్సుల గురించి చెప్తాం అంటూ అభిమానులు ఫైర్ అయిపోతున్నారు. ప్రస్తుతం అలెగ్జాండర్ బాబు వీడియో యూ ట్యూబ్ లో వైరల్ అవుతుంది.

More Related Stories