మంచు లక్ష్మి ఆ రెండు సినిమాలు కానీ చేసుంటేనా.. నా సామిరంగా..

తెలుగు ఇండస్ట్రీలో వారసులే ఉంటారు కానీ వారసురాళ్లు కాదు. ఇక్కడ హీరోయిన్ లు బయటి నుంచి వస్తారు కానీ హీరోల కుటుంబాల నుంచి కాదు. అలా వస్తే అభిమానులే ఒప్పుకోరు. కానీ ఈ రూల్స్ కు బ్రేక్ చెప్పాలని చాలా కాలంగా ట్రై చేస్తుంది మంచులక్ష్మి. కానీ ఏం చేస్తాం.. ఆమెను ఎవరూ హీరోయిన్ గా ఒప్పుకోలేకపోతున్నారు. పాపం.. అప్పటికీ మనసు చంపుకోలేక కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. దొంగాటతో పాటు గుండెల్లో గోదారి లాంటి సినిమాల్లో మంచు లక్ష్మే హీరోయిన్. ఇంకా కొన్ని సినిమాల్లో కారెక్టర్ ఆర్టిస్టుగానూ ట్రై చేసింది. కానీ ఏం చేసినా ఆమె కోరుకున్న బ్రేక్ మాత్రం రాలేదు. కానీ ఇప్పుడు మంచులక్ష్మి ఎవరూ ఊహించిన విధంగా రెచ్చిపోతుంది. ఆమె అమెరికాలో ఉన్నపుడు అక్కడి సీరియల్స్ లో చాలా హాట్ గా దర్శనమిచ్చింది.
కాకపోతే ఇక్కడి ప్రేక్షకులకు అది తెలియదంతే. తెలుగు నేలపై అడుగుపెట్టిన తర్వాత మోహన్ బాబు గౌరవాన్ని కాపాడాలనో ఏమో కానీ ఆ హాట్ నెస్ తీసి దాచేసింది. కానీ ఇప్పుడు మళ్లీ ఒరిజినల్ బయటికి వచ్చేసింది. ఈ మధ్యే వరసగా హాట్ ఫోటోషూట్స్ కూడా చేస్తుంది మంచు లక్ష్మీ. ఇదిలా ఉంటే ఒకప్పుడు ఈ రెండు భారీ సినిమాలను వదిలేసుకుంది. అవి కానీ చేసుంటే ఈ రోజు లక్ష్మీ కెరీర్ మరోలా ఉండేది. ఆమె కాదనడంతో వేరే హీరోయిన్లకు ఆ పాత్రలు కెరీర్ లో గుర్తుండిపోయేలా నిలిచిపోయాయి. అవే అరుంధతి.. బాహుబలి. ముందుగా అనుష్క కెరీర్ మార్చేసిన అరుంధతి సినిమాలో మంచు లక్ష్మీనే అడిగాడు కోడి రామకృష్ణ. కానీ అప్పటికే ఐరేంద్రి అంటూ అనగనగా ఓ ధీరుడు సినిమాలో ఇలాంటి పాత్రే చేస్తుండటంతో కాదనేసింది లక్ష్మి. ఇక బాహుబలిలో శివగామి పాత్రకు ముందు ఈమెను అడిగాడు రాజమౌళి. కానీ ఆ చిత్రంలో తాను నటిస్తాను కానీ ప్రభాస్‌కు తల్లిగా మాత్రం చేయనని చెప్పింది లక్ష్మీ. దాంతో ఆమె తర్వాత శ్రీదేవిని అడిగినా కూడా మిస్ అయింది.. ఆ తర్వాత రమ్యకృష్ణకు వచ్చింది.. ఆమె కెరీర్లోనే అది ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్ర అయిపోయింది. ఇలా ఈ రెండు లెజెండరీ సినిమాల నుంచి తప్పుకుంది మంచు లక్ష్మీ. ఈ రెండింట్లోనూ ఆమె కనిపించి ఉంటే ఇప్పుడు ఆమె కెరీర్ ఎలా ఉండేదో అంటున్నారు అభిమానులు.