ఎంత మంచి వాడవురా డేట్ కూడా లాకయ్యింది

నందమూరి కల్యాణ్‌రామ్ ప్రస్తుతం ‘ఎంతమంచి వాడవురా!’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సతీశ్ వేగేశ్న దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా విడుదలను ఖరారు చేశారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు హీరో కళ్యాణ్ రామ్ ప్రకటించారు. మెహరీన్ కౌర్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశలో ఉంది. అయితే సంక్రాంతికి మరో రెండు పెద్ద సినిమాలు ఉండడంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని అందరిలోనూ అనుమానాలు మొదలయ్యాయి. అయితే అలా ఎదురుచూసే వారి కోసం క్లారిటీ ఇచ్చాడు కల్యాణ్ రామ్. విడుదల తేదీని సోషల్ మీడియాలో ప్రకటించాడు. ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యేది ఎప్పుడంటే? 2020 సంక్రాంతి కానుకగా జనవరి 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్, ప్రమోషన్ పోస్టర్స్ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. చూడాలి మరి సంక్రాంతి రేసులో ఈ సినిమా ఏమాత్రం నిలబడుతుందో ?