English   

యాక్షన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే

action
2019-11-08 16:28:10

తెలుగు తమిళ భాషల్లో మాస్ హీరోగా విశాల్ కి మంచి క్రేజ్ వుంది. అందువల్లనే అయన తమిళ చిత్రాలు తెలుగులో కూడా మంచి నంబర్ తోనే విడుదలవుతుంటాయి. అలా తమిళంలో దర్శకుడు సుందర్ సి. రూపొందించిన 'యాక్షన్' సినిమా విడుదలకి ముస్తాబైంది. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమాను ఈ నెల 15వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు వెర్షన్ కి సంబంధించి, హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించడానికి యూనిట్ ప్లాన్ చేసింది. ఈ క్రమంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు 'దసపల్లా కన్వెన్షన్'లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరపనున్నారు.

ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ నేడు ఒక పోస్టర్ ను వదిలారు. విశాల్ సరసన నాయికగా తమన్నా నటించిన ఈ సినిమాలో సీనియర్ హీరో రాంకీ .. ఐశ్వర్య లక్ష్మి .. ఛాయా సింగ్ .. కబీర్ దుల్హన్ సింగ్ .. యోగిబాబు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. విశాల్ కల్నల్ సుభాష్ అనే ఆఫీసర్ పాత్రలో, తమన్నా కాప్ పాత్రలో నటించారు. హిప్ హప్ తమిళ సంగీతం అందించారు. టెర్రరిజం పై ఒక అధికారి చేసే పోరాటం కాన్సెప్ట్ తో ఫుల్ యాక్షన్ సీన్స్ తో రూపొందిన ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి.  

 

More Related Stories