బాలయ్యతో పోటీకి దిగుతున్న కార్తీ

ఖైదీలాంటి ప్రయోగాత్మక సినిమాతో ప్రేక్షకుల ముందు వచ్చిన కార్తీ, ఈ ఏడాది మరో సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నట్టు సమాచారం. తమిళంలో కామెడీతో కూడిన క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో ఒక సినిమా రూపొందింది. కార్తీ .. జ్యోతిక ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి, 'తంబి' అనే టైటిల్ ను ఖరారు చేయనున్నట్టు చెబుతున్నారు. దృశ్యం మలయాళ చిత్ర దర్శకుడు జీతూ జోసెఫ్ వ్యవహరించిన ఈ సినిమా మీద అందరిలోను ఆసక్తి నెలకొంది ఉంది. నిజజీవితంలో వదినా మరుదులు అయిన కార్తి, జ్యోతికలు అక్క, తమ్ముళ్లుగా నటిస్తున్నారు. కనిపించకుండా పోయిన తమ్ముడి కోసం వెతుకులాటే ఈ సినిమా ప్రధాన కథాంశం.
ఈ చిత్రంలో సత్యరాజ్, ‘రాక్షసన్’ ఫేమ్ అమ్ము అభిరామి తదితరులు నటిస్తున్నారు. గోవింద్ వసంత సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకి రాజశేఖర్ సినిమాటో గ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నాడు. కార్తీకి జోడీగా నికిలా విమల్ నర్తించిన ఈ సినిమాని ఈ ఏడాది అక్టోబర్ లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేసినా ఖైదీ సినిమా దెబ్బకి లేట్ అయింది. ఇక మరోపక్క రెమో ఫేమ్ భాగ్యరాజ్ కణ్ణన్ దర్శకత్వంలోను కార్తీ ఓ సినిమా చేయనున్నాడు. అయితే ఇదే నిజమైతే కార్తి ఈ క్రిస్మస్ పోరులో బాలయ్య ‘రూలర్’, సాయిధరమ్ తేజ్ ‘ప్రతిరోజు పండగే’ చిత్రాలతో పోటీ పడాల్సి ఉంటుంది. అంతేకాదు అదేరోజు సల్మాన్ ఖాన్ ‘దబాంగ్ 3’ కూడా అప్పుడే థియేటర్లలోకి రానుంది. తమిళనాట మాత్రం కార్తికి ఈ తేదీన పెద్దగా పోటీ లేనట్లే తెలుస్తోంది.