దారుణంగా ట్రోల్...సీరియస్ అయిన రష్మిక

సెలబ్రిటీలని ట్రోల్ చేయడం కొత్త విషయమేమీ కాదు. కాని అవి శృతిమించి ముందుకు వెళ్తే ఎవరైనా భాద పడతారు. ఎప్పుడూ ఎంతో ఓపికతో ఉంటుండే సెలబ్రిటీలు శ్రుతి మించితే నెటిజన్స్ చేసే ట్రోల్స్‌కి ఆగ్రహంతో ఊగిపోతుంటారు. తాజాగా రష్మిక తన ఇన్స్టాగ్రామ్ ద్వారా నెటిజన్‌కి చుక్కలు చూపించింది. ఈ మధ్య కాలంలో రష్మిక తన చిన్నప్పటి ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయతే రష్మిక చిన్ననాటి ఫోటోలని జత చేస్తూ.. ఎవరైన ఊహించారా? ఈ చిన్నపిల్ల ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో క్యారెక్టర్ లేనిది అవుతుంది అంటూ అసభ్యకరమైన కామెంట్స్ చేశాడు. దీంతో రష్మిక తన బాధను వ్యక్తం చేసింది. సెలెబ్రిటీల మీద ట్రోల్స్ చేస్తే మీకు ఏమోస్తుందో అర్ధం కావడం లేదు.
సెలబ్రిటీలయినంత మాత్రాన మమ్నల్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడం కరెక్టా? మేము ఏం అనం అనే కదా మీ ధైర్యం. వర్క్ విషయంలో మమ్మల్ని కామెంట్స్ చేయోచ్చు, తప్పులేదు. కాని పర్సనల్ విషయాలపై మాట్లాడే రైట్ మీకు ఎవరు ఇచ్చారు. చాలా మంది ఇలాంటి కామెంట్స్ పట్టించుకోవద్దు అని చెబుతుంటారు. కాని ఇలాంటి చెత్త విమర్శలకి సమాధానం ఇవ్వకుండా ఎలా ఉంటాం. నటులు అవ్వడం అంటే అంత ఈజీ కాదు. ప్రతి వృత్తిని అందరూ గౌరవించాలి. కానీ అన్నింటికంటే ముందు ఒకరినొకరు గౌరవించడం మొదలుపెట్టాలి. ఈ పోస్ట్ ఎవరు పెట్టారో వాళ్లకు కంగ్రాట్స్. మీరు నన్ను నొప్పించాలనుకున్నారు అందుకు సక్సెస్ అయ్యారని రష్మికా మందన్నా పేర్కొన్నారు. అయితే ఇది కన్నడ రక్షిత్ ఫ్యాన్స్ పనే అని అంటున్నారు. ఆమె అతనిని మోసం చేసి ఎంగేజ్మెంట్ అయ్యాక తప్పుకుందని సోషల్ మీడియాలో కొన్ని వర్గాల వాదన.