బాలయ్య - బోయపాటి కాంబో గురించి ఆసక్తికర అప్డేట్స్

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూలర్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. క్రిస్మస్ కి ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ మూవీ తర్వాత బాలయ్య తనకి ఇష్టమైన అచ్చొచ్చిన బోయపాటితో కలిసి క్రేజీ ప్రాజెక్ట్ చేయనున్నాడు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సింహా, లెజెండ్ చిత్రాలు మంచి విజయం సాధించడంతో ఈ సిన్నిమా మీద ఇంకా ప్రకటన లేకుండానే భారీ అంచనాలు ఉన్నాయి. అయితే బోయపాటి తాజా ప్రాజెక్ట్‌కి సంబంధించి ఆసక్తికర వార్తలు హల్చల్ చేస్తున్నాయి, అందుకో నిజం ఎంతుందో తెలియదు కానీ ఈ సినిమా గురించిన కొన్ని పుకార్లు భీబత్సంగా హల్చల్ చేస్తున్నాయి. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను సినిమాల్లో హీరో ఎంత బలంగా ఉంటాడో.. విలన్ కూడా అంతే బలంగా, పొగరుగా ఉంటాడు. అందుకే, ఆయన సినిమాల్లో హీరో పాత్రలు బాగా ఎలివేట్ అవుతాయి.
ఈ బాలకృష్ణ సినిమా ద్వారా బాలీవుడ్ హీరోను బోయపాటి విలన్‌గా పరిచయం చేయబోతున్నారని అంటున్నారు. ఆ బాలీవుడ్ హీరో ఎవరో కాదు సంజయ్ దత్. బాలయ్యకి విలన్‌గా బాలీవుడ్ హీరో సంజయ్ దత్‌ని ఎంపిక చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. ఆయనతో సంప్రదింపులు కూడా మొదలు పెట్టారనేది టాక్. ఇక ఈ సినిమాలో ఇక సెంటిమెంట్ గా ఇద్దరు భామల్ని ఎంపిక చేయనున్నారని ప్రచారంలో ఉంది. ఈ నేపథ్యంలో బాలయ్యకు ఓ హీరోయిన్ గా 27 ఏళ్ల కన్నడ బ్యూటీ రచిత రామ్ తో సంప్రదింపులు జరుపుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. రచితా రామ్ కన్నడలో బిజీ హీరోయిన్. ప్రస్తుతం ఆరేడు సినిమాలు ఆ అమ్మడి చేతిలో ఉన్నాయి, మరి ఆమె బాలయ్య సరసన నటించేందుకు ఒప్పుకుంటుందా అనేది కూడా చూడాలి. ఇక మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనున్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో విడుదల అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు.