English   

షాకింగ్ కలెక్షన్స్ సాధించిన ఏడు చేపల కధ

yedu
2019-11-09 07:42:45

ఏడు చేపల కథ అనే ఒక చిన్న సినిమా, ఈ సినిమాలో నటించిన హీరో, నటీనటులు కానీ దర్శకుడు, నిర్మాతలు కానీ.. అసలు ఈ చిత్రానికి పనిచేసిన ఏ ఒక్కరు గురించి కానీ ప్రేక్షకులకు తెలీదు. కానీ, టీజర్లు, ట్రైలర్‌ తో బోల్డ్ కంటెంట్‌తో, అడల్ట్ కామెడీతో ప్రేక్షకులను ఆకర్షించారు. సినిమా మీద  విపరీతమై బజ్‌ను క్రియేట్ చేయడంతో ఈ సినిమాకి మొదటి రోజు కలెక్షన్స్ అదిరిపోయాయి. గురువారం విడుదలైన ఈ సినిమాని చూసిన వారు నిరాశగా వెనుతిరిగినా తొలిరోజు కలెక్షన్లు మాత్రం అదిరిపోయాయి.  ఈ సినిమా ఏకంగా 1.06 కోట్ల షేర్ ని రెండు తెలుగు రాష్ట్రాలలో అందుకోగా వరల్డ్ వైడ్ గా మొదటి రోజు 1.13 కోట్ల షేర్ ని సాధించి బాక్స్ ఆఫీస్ దగ్గర షాకింగ్ ఓపెనింగ్స్ ని మొదటి రోజు అందుకుని సంచలనం సృష్టించింది,

సినిమా మొదటి రోజు ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే…నిజాం : 38L, సీడెడ్ : 21L, ఈస్ట్ : 8L, వెస్ట్ : 6.5L, గుంటూరు : 7L, కృష్ణా : 7.4L, నేల్లోరు : 5L తెలుగు రాష్ట్రాలు  Day 1:- 1.06Cr, కర్ణాటక - రెస్టాఫ్ ఇండియా : 5L. ఓవర్సీస్ : 2L మొత్తం : 1.13CR(1.9cr గ్రాస్) ఇక ఈ సినిమాని రెండు రాష్ట్రాలలో 1.4 కోట్లకు అమ్మగా వరల్డ్ వైడ్ గా 1.7 కోట్లకు అమ్మారు, దాంతో 2.2 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా మొదటి రోజే సగానికి పైగా రికవరీ చేయగా వీకెండ్ లో బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే సినిమాకు పూర్తిగా నెగిటివ్ టాక్ రావడంతో ఇక ఈ సినిమాకు వెళ్లేవాళ్లు ఉండరనే టాక్ కూడా వినిపిస్తోంది. అడల్ట్ కంటెంట్ కోసమే చాలా మంది ఈ సినిమాకు వెళ్లారు. కానీ, సినిమాలో అదేమీ లేద్జి కాబట్టి రెండో రోజు నుంచి వసూళ్లు భారీగా పడిపోవడం ఖాయమనే మాట వినిపిస్తోంది.  

 

More Related Stories