English   

సరిలేరు నీకెవ్వరు కేరళ షెడ్యూల్ అవగొట్టేశారా

Sarileru Neekevvaru
2019-11-09 11:28:14

సూపర్ స్టార్ మహేష్ బాబు - అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'.  ఇప్పటి వరకూ ఫ్లాప్ అనేదే తెలియని అనిల్ రావిపూడి దర్శకత్వంలో గత మూడు నాలుగు సినిమాలు హిట్ కొట్టి లైన్ లో ఉన్న మహేష్ బాబు సినిమా చేస్తుండడంతో ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.  ఈ సినిమా తో మునుపటి తరం స్టార్ హీరోయిన్ విజయశాంతి రీ-ఎంట్రీ ఇస్తుండడం సినిమాపై మరింతగా బజ్ నెలకొంది. సరిలేరు నీకెవ్వరు టీమ్ ఈమధ్యే కేరళ షెడ్యూల్ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే.  ఈ షెడ్యూల్ లో  రెండు పాటలను.. ఒక థ్రిల్లింగ్ ఫైట్ సీక్వెన్సును చిత్రీకరిస్తారని ప్రచారం జరిగింది. 

ఈ షెడ్యూల్ నవంబర్ 25 వరకూ కొనసాగుతుందని సమాచారం. అయితే శుక్రవారంతో కేరళ షెడ్యూల్‌ పూర్తయిందని అందుకే అక్కడి రైల్వేస్టేషన్‌లో చిత్ర బృందం కలిసి తీసుకున్న గ్రూప్‌ ఫొటోను నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేసిందని ఒక ప్రముఖ పత్రిక ప్రచురించింది. ఈ ఫొటోలో కథానాయిక రష్మిక, నటీనటులు ప్రకాశ్‌రాజ్‌, విజయశాంతి, రాజేంద్ర ప్రసాద్‌, సంగీత మొదలగు వారు కనిపించారు. మహేశ్‌ మాత్రం ఆలోవ్ గ్రీన్ దుస్తుల్లో దర్శనమిచ్చారు. ఈ పార్ట్ తో షూటింగ్ లో మేజర్ పార్ట్ పూర్తయినట్టేనని అంటున్నారు. ఈ షెడ్యూల్ పూర్తయిన తర్వాతే ప్రమోషన్స్ మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. 

More Related Stories