English   

కమ్మ రాజ్యంలో కడప రెడ్లులో బ్రహ్మీ క్యారెక్టర్ ఇదేనా

Brahmanandam
2019-11-09 15:02:21

సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కమ్మ రాజ్యంలో కడప రెడ్లు పేరుతో మరో సంచలనానికి తెరతీశారన్న సంగతి తెలిసిందే. క‌మ్మ రాజ్యంలో క‌డ‌ప రెడ్లు ట్రైల‌ర్, కొన్ని సాంగ్స్ రిలీజ్ చేసి మరీ ఏపీ రాజ‌కీయాల్లో ఏం జ‌రుగుతోందో.. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సీఎం అయ్యాక ప‌రిణామాలు ఎలా మారాయో అన్నిటినీ తెర‌కెక్కించేస్తున్నాన‌ని క్లారిటీ ఇచ్చాడు. జ‌గ‌న్ సీఎం అవ్వడం మొద‌లు ఏమేం జరుగుతున్నాయి అనే విషయాన్ని వర్మ  తెర‌పై చూపించ‌బోతున్నాడు. బ‌ర్నింగ్ టాపిక్ కి మ‌సాలా జోడించి మరీ చూపించనున్నాడు. 

కత్తి మహేష్ నుంచి ఆలీ మీదుగా బ్రహ్మానందం వరకు చాలా మంది నటులను ఆర్జీవీ ఈ సినిమాకోసం రోప్ చేసారు. జగన్, చంద్రబాబు క్యారెక్టర్లకు సరిగ్గా నప్పే నటుల్ని తీసుకుని, పవన్ కళ్యాణ్, లోకేష్ ల డూప్స్ ని దింపి మరీ రచ్చ చేశారు. అదే సమయంలో కమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమాలో తాను కూడా నటిస్తున్నానని ప్రకటించారు. ఇక ఈ సినిమాలో బ్రహ్మానందం నటించబోయే క్యారెక్టర్ ఇదేనని ఒక చర్చ నడుస్తోంది. ఇందులో ఏబీఎన్ రాదాకృష్ణ క్యారెక్టర్ లో నటిస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఎందుకంటే నిన్న ఆర్జీవీ ఒక పిక్ రిలీజ్ చేశారు. అందులో బాబు క్యారెక్టర్ తో బ్రహ్మానందం మాట్లాడుతున్నట్టు ఉంది. ఈ పిక్ ని బట్టే అది ఆర్కే అనే ప్రచారం జరుగుతోంది.

More Related Stories