English   

నటుడికి తీవ్ర అస్వస్థత

actor
2019-11-10 07:18:07

ప్రముఖ తమిళ నటుడు తెన్నవన్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారనే వార్త కలకలం రేపుతోంది. చియాన్‌ విక్రమ్‌ ‘జెమిని’తో తెన్నవన్‌కు సహాయనటుడిగా మంచి గుర్తింపు లభించింది. కమల్‌ హాసన్‌ విరుమండి, జిగర్తాండా, సుందర పాండియన్, సండకోళి వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా రజనీ కాంత్‌ ‘పెట్టా’సినిమాలో మినిస్టర్‌ పాత్రలో తెన్నివన్‌ ఆకట్టుకున్నాడు. అయితే నిన్న తెల్లవారు జామున ఆయనకు పక్షవాతం రావడంతో కుటుంబసభ్యులు హుటాహుటిన చెన్నైలోని ఓ ప్రయివేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారని సమాచారం.

అయితే అయనకు వచ్చిన పక్షవాత ప్రభావం ఎక్కువగా ఉండటంతో ఐసీయూలో అడ్మిట్ చేసి ట్రీట్‌మెంట్‌ అందిస్తున్నారు. అయితే తెన్నవన్‌ పరిస్థితి క్రిటికల్‌గానే ఉన్నట్లు వైద్య వర్గాల నుండి అందుతున్న సమాచారం. ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించిందన్న వార్త తెలుసుకున్న కోలీవుడ్‌ ప్రముఖులు ఆస్పత్రికి చేరుకుని తెన్నవన్‌ను పరామర్శించి వస్తున్నారు.

More Related Stories