English   

మహేష్ బాలీవుడ్ ఎంట్రీ ఖాయం అయిందా

mb
2019-11-10 07:35:31

మ‌హేష్‌బాబు కి బాలీవుడ్ నుంచి చాలా ఆఫ‌ర్లే వ‌చ్చాయి. కానీ ఎందుకో ఎప్పుడూ ఆయన పెద్ద‌గా ఆస‌క్తి చూపించ‌లేదు. `మంచి క‌థ‌లొస్తే మాత్రం త‌ప్ప‌కుండా చేస్తా` అని ఎప్ప‌టిక‌ప్పుడు త‌ప్పించుకుంటూనే ఉన్నా ఈ మధ్య ఒక బాలీవుడ్ వెబ్ సైట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాత్రం వచ్చే రెండేళ్ళ వరకూ తన డేట్స్ ఖాళీ లేవంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పుడు ఆయన బాలీవుడ్ ఎంట్రీ గురించిన ఒక వార్త హల్చల్ చేస్తోంది. మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం `స‌రిలేరు నీకెవ్వ‌రు` సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా త‌ర‌వాత ఆయన ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌కత్వం వ‌హించే చిత్రంలో న‌టించ‌బోతున్నారనే టాక్ మొదలయ్యింది. దీని మీద అధికారిక ప్రకటనలు లేకున్నా కేజీఎఫ్‌ తో రచ్చ రేపిన ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్‌ నమ్రతను కలిసి కధ చెప్పి ఫైనల్ చేయించుకున్నారని ప్రచారం జరిగింది.

అయితే తాజా సమాచారం ప్రకారం మహేష్ తర్వాత సినిమా ఆయనతోనే అని ఆ సినిమా ప్యాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతోందని అంటున్నారు. అన్ని భాష‌ల సినీ అభిమానుల అభిరుచుల‌కు త‌గ్గ‌ట్టుగానే క‌థ ఉండాల‌నే విధంగా ప్ర‌శాంత్ నీల్ త‌యారు చేస్తున్నాడ‌ని స‌మాచారం. అతి త్వ‌ర‌లోనే ఈ కాంబినేష‌న్‌కి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవ‌కాశం ఉందని అంటున్నారు. ఇక అంతకు ముందు కూడా మహేష్ సందీప్ రెడ్డి వంగా కాంబినేష్ సినిమా రూపుదిద్దుకోనుందని, ఆ సినిమాని బాలీవుడ్ లో ఎంట్రీ ఇద్దామని ప్లాన్ చేసినట్టు ప్రచారం జరిగింది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

More Related Stories