English   

రచ్చ చేస్తున్న ఏడు చేపల కధ కలెక్షన్స్

yedu
2019-11-10 08:09:46

పోర్న్ సైట్స్ బ్యాన్ ప్రభావమో ఇంకేమో కానీ ఏడు చేపల కధ సినిమాకి కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. జనాలు బూతు మీద ఎంత ఇంటరెస్ట్ చూపిస్తున్నారో ఏడు చేపల కథ’ సినిమాకు వస్తున్న కలెక్షన్లు చూస్తే అర్ధమైపోతుంది. పోస్టర్స్, టీజర్, ట్రైలర్‌‌ లతో ఒక్క సారిగా అంచనాలు పెంచుకున్న ఈ సినిమా ఏడు చేపల కథ కమర్షియల్‌గా క్లిక్ అయ్యింది. ఈ సినిమాకి బీభత్సమైన హైప్ రావడంలో కరువు పట్టి ఉన్న కుర్రకారు థియేటర్స్‌కి క్యూ కట్టారు. ఈ చిత్రాన్ని భారీగా 500 స్క్రీన్స్‌పై విడుదల చేశారంటే ఈ మూవీకి ఏర్పడిన క్రేజ్ అర్ధం చేసుకోవచ్చు. ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకుంటూ.. ‘ఏడు చేపల కథ’ సినిమా 1. 4 కోట్ల బిజినెస్ చేసుకుంది. రెండో రోజు మరింత పుంజుకుని 2. 4 కోట్లు రాబట్టి బ్రేక్ ఈవెన్ సాధించిందని ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం. తెలుగులో గుంటూరు టాకీస్ తర్వాత అడల్డ్ కంటెంట్‌తో తెరకెక్కిన ‘ఏడు చేపల కథ’ బాక్సాఫీస్ దగ్గర హిట్ అనిపించుకుంది. ఇక ఈరోజు ఆదివారం కావడంతో ఏమేరకు  వసూళు చేస్తుందో చూడాలి.

More Related Stories