English   

కోటికి తగ్గని నిధి...చరణ్ చేతుల మీదుగా ఓపెనింగ్ 

 Nidhhi Agerwal
2019-11-10 09:19:16

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టాలి అనే సామెతను మన టాలీవుడ్ హీరోయిన్స్ బాగా వంట బట్టిన్చుకున్తున్నారు. ఎందుకంటే మన ఇండస్ట్రీలో హీరోయిన్ల రెమ్యూనరేషన్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. స్టార్ హీరోయిన్ అయిన తరువాత ఒక్కో సినిమాకు ఒక్కోలా పారితోషికం అందుకునే ముద్దుగుమ్మలు స్టార్ హీరో సినిమాకు ఓ రేటు, స్టార్ డైరెక్టర్ సినిమాకు ఓ రేటు కుర్ర హీరోలు అప్ కమింగ్ హీరోలు, కొత్త హీరోల సరసన నటించే విషయంలో కాస్త ఎక్కువ పట్టుబడుతూ ఉంటారు. లేటెస్ట్‌గా ఇస్మార్ట్ శంకర్‌ మూవీతో హిట్ అందుకున్న నిధి అగర్వాల్ కూడా ఇదే బాటలో నడుస్తోంది. ఆమెకు మహేష్ మేనల్లుడు గల్లా అశోక్ డెబ్యూ మూవీలో నటించే అవకాశం దక్కింది. 

ఈ రోజు హైదరాబాద్ లో అట్టహాసంగా ఈ మూవీ ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి ఛీఫ్ గెస్ట్ గా రామ్ చరణ్ వస్తున్నారు. ఐతే ఈ చిత్రంలో నటిస్తున్న నిధి రెమ్యూనరేషన్ మీద గట్టిగా ప్రచారం జరుగుతోంది. నిధి అగర్వాల్ ఈ చిత్రంలో నటించడానికి దాదాపు కోటి 25 లక్షల దాకా డిమాండ్ చేసిందట. డెబ్యూ హీరో పక్కన నటించాలంటే ఆమాత్రం ఇవ్వాల్సిందేనని ఆమె పట్టుపట్టిందట. ఆమెకు అంతా ఇచ్చిన నిర్మాతలు ఆ సినిమాకి కన్ఫాం చేశారట. ఇక ఈ సినిమాకి శ్రీ రామ్ ఆదిత్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా అమ‌ర్‌రాజా మీడియా అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై మహేష్ బాబు అక్క ప‌ద్మావ‌తి గ‌ల్లా నిర్మిస్తున్నారు.

More Related Stories