English   

ఆ దర్శకుడి సినిమా పట్టాలెక్కేనా 

Akhil Akkineni
2019-11-10 10:18:56

గీతగోవిందం సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టినీ ఆకర్షించాడు డైరెక్టర్ పరశురామ్. తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ఆ చిత్రం వంద కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టింది. ఆ సినిమా విడుదలై ఏడాదిన్నర గడుస్తున్నా ఇప్పటివరకు పరశురామ్ మరో సినిమాను పట్టాలెక్కించలేకపోయాడు. మహేష్ బాబుతో సినిమా చేయాలని `గీతగోవిందం` తర్వాత పరశురామ్ చాలా కాలం వెయిట్ చేశాడు. అయితే మహేష్ కున్న కమిట్మెంట్ స్ దృష్ట్యా అది కుదిరేలా లేదు మహేష్ తర్వాత అల్లు అర్జున్, ప్రభాస్ వంటి హీరోలకు కూడా కథ వినిపించాడట. వారు కూడా అంత ఆసక్తి చూపలేదని సమాచారం. ఇక ప్రస్తుతం ఆయన అఖిల్‌తో ఓ సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారనేది ఫిలిం నగర్ టాక్. అఖిల్ కి ఉన్న లవర్‌ బాయ్‌ ఇమేజ్‌కు సరిపోయేలా ఓ కొత్త ప్రేమకథను నాగార్జునకి వినిపించాడని ఆ కధ అక్కినేని ఫ్యామిలీకి సైతం నచ్చిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే.. బొమ్మరిల్లు భాస్కర్‌ చిత్రం పూర్తయిన వెంటనే అఖిల్ పరశురామ్‌ సినిమా ఓపెన్ చేస్తాడని అంటున్నారు. అది కూడా గీత బ్యానర్ లోనే ఉండే అవకాశం ఉందని అంటున్నారు. చూడాలి ఇది ఎంతవరకూ నిజం అవుతుందో ?

More Related Stories