English   

వర్మ నీకిది తగునా.. దిగ్గజ దర్శకుడు దిగజారుతున్నాడా..

RGV
2019-11-10 16:18:43

రాంగోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఆయన ఎలా ఆలోచిస్తాడో.. ఎలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన ఎంచుకునే కథలు తెరకెక్కించే సినిమాలే వర్మ అంటే ఏంటో చూపిస్తాయి. అయితే ఇన్ని రోజులు ఎలా ఉన్నా కూడా ఇప్పుడు వర్మ మరీ దిగజారుతున్నారు అనే సంకేతాలు అయితే వస్తున్నాయి. కేవలం డబ్బు కోసమే కులాలు మతాల మధ్య చిచ్చు పెట్టేలా సినిమాలను తెరకెక్కిస్తున్నాడు అంటూ చాలామంది మండిపడుతున్నారు. 

ముఖ్యంగా ఇప్పుడు విడుదలైన కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాలోని పప్పు లాంటి అబ్బాయి పాట వర్మ లోని కుంచిత మనస్తత్వాన్ని బయట పెడుతుంది అంటున్నారు విశ్లేషకులు. అసలు ఇలాంటి పాటలను ఎలా రాయిస్తారు.. అవతల వ్యక్తి వ్యక్తిత్వాన్ని మరీ అంతగా అవమానించేలా పాట ఎలా రాస్తారు అంటూ తెలుగు తమ్ముళ్లు కూడా రామ్ గోపాల్ వర్మ పై నిప్పులు చెరుగుతున్నారు. ఇంత దారుణంగా ఒక వ్యక్తిని టార్గెట్ చేయడం.. అతన్ని కించపరచడం ఏ విధంగా ఒక సినిమా దర్శకుడికి ఉచితమైన విధానం అంటూ ప్రశ్నిస్తున్నారు. సినిమా అంటే పదిమందికి మంచి చెప్పకపోయినా పర్వాలేదు కానీ చెడు చేయకూడదు అంటారు. కానీ రాంగోపాల్ వర్మ మాత్రం కేవలం చెడు చెప్పడానికే సినిమాలు చేస్తున్నాడు అంటూ ఒక వర్గం మండిపడుతుంది. 

ఇది ఆయన వరకు వెళ్లిందా లేదా అనేది పక్కనపెడితే ఇప్పుడు విడుదలైన లోకేష్ పాట మాత్రం చాలా దారుణంగా ఉంది. అందులో ఆయన వాడిన కొన్ని పదాలు విన్న తర్వాత తెలుగు తమ్ముళ్లకు అసలు నిద్ర పట్టడం లేదు. తాత నుంచి నువ్వు సైకిల్ లాక్కున్నావు.. ఆ సైకిల్ నాకు తొక్కే ఓపిక లేదు.. అమెరికా పోతా జల్సా చేస్తా ఇలా ఇష్టం వచ్చినట్లు లిరిక్స్ రాయించాడు వర్మ. ఆయనలాంటి దిగ్గజ దర్శకుడు ఇలాంటి పాటలు అవసరమా ఇలాంటి సినిమాలు అవసరమా అంటూ ఆయన హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా బాధపడుతున్నారు. మరి దీనిపై ఆయన ఏం సమాధానం చెబుతాడో చూడాలి. నవంబర్ 29న కమ్మ రాజ్యంలో కడప రెడ్లు విడుదల కానుంది.

More Related Stories