కమల్ హాసన్ ఇంకా మారలేదు.. లేటు వయసులో ఘాటు ప్రేమ..

కమల్ హాసన్ అంటే కేవలం నటుడు దర్శకుడు మాత్రమే కాదు ఇప్పుడు రాజకీయ నాయకుడు కూడా గుర్తుకొస్తున్నాడు. తన పార్టీ గెలిచిన ఓడిన పవన్ కళ్యాణ్ మాదిరి ప్రజల మధ్యలో ఉంటానంటున్నాడు ఈ లోక నాయకుడు. అయితే ఈయనకు సినిమా ఇమేజ్ తో పాటు పర్సనల్ గా రొమాంటిక్ ఇమేజ్ కూడా కూడా ఉంది. ముఖ్యంగా ఎఫైర్లు మెయింటెన్ చేయడంలో కమల్ హాసన్ ఆరితేరిపోయాడు.
ఎప్పుడో 80వ దశకం నుంచే తన ప్రేమకథలు మొదలుపెట్టాడు కమల్ హాసన్. అప్పట్లోనే ఒక భార్య ఉండగానే శృతిహాసన్ తల్లి సారిక తో ఎఫైర్ పెట్టుకున్నాడు. తర్వాత ఆమెను పెళ్లి చేసుకున్నాడు. మనస్పర్థలు వచ్చి విడిపోయాడు. ఇక ఆ తరువాత చాలా కాలం పాటు సీనియర్ నటి గౌతమితో సహజీవనం చేశాడు లోకనాయకుడు. మూడేళ్ల కింద ఈ జంట విడిపోయింది. పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నట్లు ప్రకటించారు కమల్ హాసన్ గౌతమి. ఆ తర్వాత ఆయన జీవితంలోకి పూజ కుమార్ వచ్చింది.
విశ్వరూపం సినిమా ఆయనతో పాటు కలిసి నటించింది పూజ. తెలుగులో కూడా రాజశేఖర్ హీరోగా వచ్చిన గరుడవేగ సినిమాలో నటించింది పూజ కుమార్. ఆ వెంటనే ఉత్తమ విలన్ సినిమాలో కూడా పూజ కుమార్ కు ఆఫర్ ఇచ్చాడు కమల్. నటిస్తున్నప్పుడే ఆమెతో ప్రేమలో పడిపోయాడు. ఇక ఇప్పుడు ఆమెతో సహజీవనం చేస్తున్న విషయం ప్రపంచానికి తెలిసి పోయింది. ఈ మధ్య కమల్ హాసన్ తన 64 వ పుట్టినరోజును కుటుంబంతో పాటు ఘనంగా జరుపుకున్నారు. అందులో అందరూ ఉన్నారు.. పూజా కుమార్ తో సహా. కమల్ ఫ్యామిలీ ఫోటోలో పూజను చూసి అంతా కంగారు పడిన తర్వాత అసలు విషయం అర్థమైంది. ప్రస్తుతం కమల్ హాసన్ సహజీవనం చేస్తున్నాడు అనేది స్పష్టం అయిపోయింది. మొత్తానికి 60 దాటిన తర్వాత కూడా తన ఇమేజ్ కొనసాగిస్తున్నాడు కమల్ హాసన్.