English   

ఏంటి సైరా అప్పుడే టీవీలో వచ్చేస్తుందా.. ఏ ఛానల్లో..

 Sye Raa Narasimha Reddy
2019-11-10 17:59:16

చిరంజీవి ప్రాజెక్టు గా తెరకెక్కింది సైరా నరసింహారెడ్డి. సురేందర్ రెడ్డి తీసుకువచ్చిన ఈ సినిమా  ప్రేక్షకులను బాగా అలరించింది. అయితే రిపీటెడ్ ఆడియన్స్ లేక చాలా చోట్ల నష్టాల బారిన పడింది. తెలుగు వర్షన్ మాత్రమే విజయం సాధించింది సైరా. కానీ మిగిలిన భాషలలో దారుణమైన డిజాస్టర్ అయిపోయింది. మంచి రివ్యూస్ వచ్చినా కూడా ఎందుకో మరి ప్రేక్షకులు పెద్దగా ఆకర్షితులు కాలేదు. తెలుగులో మాత్రమే చిరంజీవి ఇమేజ్ ఈ సినిమాను కాపాడింది. మిగిలిన భాషలలో  అది అంతగా వర్కవుట్ కాలేదు. 

 ఇదిలా ఉంటే ఒక స్వాతంత్ర సమరయోధుల జీవిత కథను అంతకంటే అద్భుతంగా ఎవరు తెరకెక్కించలేరని విమర్శకుల ప్రశంసలు అందుకుంది సైరా నరసింహారెడ్డి. ఈ సినిమా త్వరలోనే బుల్లితెరపై దర్శనం ఇవ్వబోతోందని తెలుస్తోంది. అక్టోబర్ 2న గాంధీ జయంతి కానుకగా విడుదలైంది సైరా నరసింహారెడ్డి. విడుదలైన 50 రోజుల తర్వాత అమెజాన్ లో తీసుకురావాలని ముందుగా చేసుకున్న ఒప్పందం. ఇక ఒక ప్రముఖ ఛానల్ సైరా చాలా త్వరగా బుల్లితెరపై ప్రదర్శించాలని ప్రయత్నాలు చేస్తోంది. అదే జెమినీ టీవీ.. తాజాగా ఈ చానల్ సోషల్ మీడియా లో ఒక ఆసక్తికరమైన అంశం ట్వీట్ చేసింది. మరో రెండు రోజుల్లో ఓ భారీ అనౌన్స్ మెంట్ చెయ్యబోతున్నామని చెప్పారు. దీనికి సంబంధించిన ఒక మోషన్ పోస్టర్ వీడియోను కూడా విడుదల చేశారు. 

ఇదంతా చూస్తుంటే సైరా నరసింహారెడ్డి బుల్లితెర ప్రీమియర్ కోసం జెమినీ చేస్తున్న హంగామా అంటున్నారు విశ్లేషకులు. వీలైనంత త్వరగా ఈ సినిమాను టీవీలో ప్లే చేయాలని చూస్తుంది జెమిని. ఒక్కసారి అమెజాన్ లో విడుదలైన తర్వాత టీవీలో టిఆర్పి రేటింగ్స్ భారీగా పడిపోవడం ఖాయం. అందుకే వాటి తో పోటీగా ఈ సినిమాను విడుదల చేయాలని చూస్తోంది. దాంతో బుల్లితెరపై సైరా దర్శనం ఎప్పుడో త్వరలోనే తేలనుంది.

More Related Stories