English   

తలైవి షూటింగ్ స్టార్ట్...ఎన్టీఆర్ ఆయనేనా 

Kangana Ranaut
2019-11-11 08:51:03

"జయలలిత" ఈ పేరు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పురుచ్చి తలైవి అంటూ తమిళ ప్రజలతో పిలుపించుకున్న కోమలవల్లి అలియాస్ జయలలిత.  కన్నడలో ‘శ్రీ శైల మహత్మ్యం’ అనే చిత్రం ద్వారా బాలనటిగా చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన జయ దాదాపు 140కి పైగా చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత సినీ రంగం నుంచి వచ్చి ఎమ్జీఆర్ వారసురాలిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆమె తమిళులకు ఆరాధ్య దైవంగా మారింది. అనారోగ్యంతో బాధపడుతూన్న ఆమె 2016లో కన్నుమూశారు. ప్రస్తుతం జయలలిత జీవిత ఆధారంగా ఏకకాలంలో మూడు సినిమాలు తెరకెక్కుతున్నాయి.  ప్రియదర్శిని దర్శకత్వం వహిస్తున్న సినిమాలో జయలలితగా నిత్యా మీనన్ నటిస్తున్నారు. 

మరోవైపు సీనియర్ దర్శకుడు భారతిరాజా కూడా ఓ సినిమా తీసే ఏర్పాట్లలో ఉన్నారు. అలాగే కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో విజయ్ దర్శకత్వంలో జయలలిత బయోపిక్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూజా కార్యక్రమాలతో చైన్నైలో నిన్న ఉదయం ప్రారంభం అయినట్టు బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు. ఈ సినిమాలో ఎమ్జీఆర్ పాత్రలో అరవింద్ స్వామిగా నటిస్తుండగా రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్నారు. ఈ సినిమాను  ఎన్టీఆర్ బ‌యోపిక్ నిర్మిస్తున్న వైబ్రీ మీడియా నిర్మిస్తోంది.  

తమిళం,తెలుగు, హిందీ మూడు భాషల్లో ఒకేసారి నిర్మిస్తున్నారు. ‘తలైవి’ చిత్రానికి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ సహకారం అందిస్తున్నారు. ఈ  సినిమాను విబ్రీ మీడియా పతాకంపై విష్ణు వర్థన్ ఇందూరి, శైలేష్ ఆర్ సింగ్ సంయుక్తంగా  తమిళం,తెలుగు, హిందీ మూడు భాషల్లో నిర్మిస్తున్నారు.  ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రలో టాలీవుడ్ అగ్ర నటుడు నటించబోతున్నట్టు చెబుతున్నారు, అయితే అది బాలకృష్ణ ఏనా ? లేదా జూనియర్ ఎన్టీఆరా అనేది తెలియాల్సి ఉంది. మరో వైపు శోభన్ బాబు పాత్ర కోసం మరో స్టార్ నటుడ్ని తీసుకునే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది.

More Related Stories