బన్నీకి గట్టి పోటీ ఇవ్వడానికి రెడీ

టాలీవుడ్లో ఇద్దరు స్టార్ హీరోల మధ్య నెలకొన్న పోటీ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. వచ్చే సంక్రాంతికి మహేష్‌బాబు సరిలేరు నీకెవ్వరు, బన్నీ అల వైకుంఠపురంలో సినిమాలు రెండూ ఒకే రోజు జనవరి 12న రిలీజ్ డేట్లు ప్రకటించుకుని ఆ చర్చకు తావిచ్చారు. ఈ ఇద్దరు పెద్ద హీరోల సినిమాలు ఒకే రోజు పోటీపోటీగా రిలీజ్ డేట్లు ఎనౌన్స్ చేసుకోవడంతో ట్రేడ్ వర్గాలలో పెద్దఎత్తున చర్చలు నడుస్తున్నాయి. అయితే సరిలేరు నీకెవ్వరు నుండి ఇప్పటి వరకు స్టిల్స్ మాత్రమే బయటకు వచ్చాయి. అంతకుమించి మరే ఊపు లేదు. కానీ కౌంటర్ గా వస్తున్న అల్లు అర్జున్-త్రివిక్రమ్ శ్రీనివాస్ ల 'అల వైకుంఠపురములో' సినిమా నుంచి రెండు పాటలు వచ్చాయి.
భీబత్సమైన హిట్ అయ్యాయి. ఇలాంటి టైమ్ లో మహేష్ ఫ్యాన్స్ నుంచి దర్శకుడు అనిల్ రావిపూడికి వత్తిడి పెరిగడంతో నవంబర్ 15 నుంచి ప్రచారానికి తెర లేపుతున్నాటు సమాచారం. నిజానికి అల వైకుంటపురం సినిమా అడ్వాన్స్ ప్రచారం గురించి సరిలేరు నీకెవ్వరు టీమ్ ఒక కౌంటర్ వీడియో కూడా రిలీజ్ చేసింది. కానీ పబ్లిసిటీ మెటీరియల్ చాలా వుండడం, ఫ్యాన్స్ కూడా ఏదో ఒకటి ఒత్తిడి చేస్తుండడంతో నవంబర్ 15 నుంచి మొట్టమొదటి లిరికల్ వీడియో రిలీజ్ చేయనున్నట్టు సమాచారం. ఈ పాటతో మహేష్ బన్నీకి గట్టి పోటీ ఇవ్వబోతున్నాడని అంటున్నారు యూనిట్.