English   

రాశీ ఖన్నాకు మంచి రోజులు వచ్చేసినట్లేనా..

Raashi khanna
2019-11-11 17:21:35

రాశీఖ‌న్నా.. ఈ పేరుతో ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెలుగులో చాలా సినిమాలు చేసింది.. ఇక్క‌డ విజ‌యాలు కూడా అందుకుంది. కానీ ఇప్పుడు లేవు క‌దా.. అందుకే మ‌నోళ్లు పెద్దగా ప‌ట్టించుకోవ‌డం మానేసారు. శ్రీ‌నివాస క‌ళ్యాణం ఫ్లాప్ త‌ర్వాత అమ్మ‌డు తెలుగులో అరకొర అవకాశాలే వస్తున్నాయి. ప్ర‌స్తుతం త‌మిళ్ ఇండ‌స్ట్రీపై దృష్టి పెట్టింది రాశీఖ‌న్నా. రెండేళ్ల కింది వ‌ర‌కు తెలుగు త‌ప్ప మ‌రో భాష‌లో సినిమాలే చేయ‌ని రాశీఖ‌న్నా.. ఇప్పుడు త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల‌పై కూడా ఫోక‌స్ పెట్టింది. విల‌న్ సినిమాతో కేర‌ళ‌కు వెళ్లిన ఈ బ్యూటీ.. అక్క‌డ తొలి సినిమాతోనే షాక్ తినేసింది. దాంతో ఇప్పుడు త‌మిళ్ ఇండ‌స్ట్రీపై ఫోకస్ చేసింది ఈ ముద్దుగుమ్మ‌. అక్క‌డ ఇప్పుడు జ‌యంర‌వి హీరోగా సుభాష్ సినిమాలో న‌టిస్తుంది రాశీఖ‌న్నా. ఇది తెలుగులో కూడా అనువాదం అవుతుంది కానీ పెద్ద‌గా ప్ర‌యోజ‌నం ఉండేలా క‌నిపించ‌డం లేదు. తెలుగులో విజ‌య్ దేవ‌ర‌కొండ వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో న‌టించే అవ‌కాశం అందుకుంది రాశీఖ‌న్నా. క్రాంతిమాధ‌వ్ దీనికి ద‌ర్శ‌కుడు. అయితే ఈ చిత్ర షూటింగ్ ఇంకా మొద‌లు కాలేదు. ఈ సినిమాతో పాటు సాయి తేజ్ ప్రతిరోజూ పండగే సినిమాలోనూ రాశీ హీరోయిన్. స్టార్ హీరోలు అవకాశాలు ఇస్తారేమో అనుకుంటే అస్సలు వర్కవుట్ కావడం లేదు. అందుకే చిన్న హీరోలు.. వచ్చిన అవకాశాలతోనే సరిపెట్టుకుంటుంది రాశీ ఖన్నా. అయితే ఒక‌ప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీ అని గిరి గీసుకుని కూర్చున్న రాశీఖ‌న్నా.. ఇప్పుడు మాత్రం తెగిన గాలిప‌టంలా అన్ని ఇండ‌స్ట్రీలు చుట్టేస్తుంది. 

More Related Stories