లతా మంగేష్కర్కు తీవ్ర అస్వస్థత

లెజండరీ సింగర్ లతా మంగేష్కర్ అస్వస్థతకు గురయ్యారు. నిన్న అర్థరాత్రి 1.30 సమయంలో ఊపిరి తీసుకోవడంలో ఆమె ఇబ్బందికి గురవడంతో వెంటనే అప్రమత్తమైన బంధువులు ఆమెను ముంబయిలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్కు తీసుకెళ్లారని సమాచారం. కొన్ని రోజులుగా ఆమెకు శ్వాసకోశ సమస్యల వలన ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. ఎడమ వెంట్రిక్యులర్ ఫెయిల్యూర్తోపాటు, న్యుమోనియో కూడా ఎటాక్ కావడంతో ఆసుపత్రి సీనియర్ వైద్య సలహాదారు డాక్టర్ ఫరోఖ్ ఇ ఉద్వాడియా పర్యవేక్షణలో ఆమె చికిత్స పొందుతున్నారు.
ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది. లత ఆరోగ్యం త్వరలోనే ఆసుపత్రి హెల్త్ బులెటన్ విడుదల చేయనుంది. లత కెరీర్లో ఇప్పటి వరకు 25 వేలకు పైగా సోలో పాటలు పాడి గిన్నీస్ రికార్డు సొంతం చేసుకున్నారు. నైటింగిల్ ఆఫ్ ఇండియా అంటూ లతకు బిరుదుంది. భారత ప్రభుత్వం ఆమెకు పద్మభూషణ్, దాదా సాహెబ్ ఫాల్కే, భారత రత్న, పద్మ విభూషణ్ అవార్డులతో సత్కరించింది. ప్రస్తుతం ఆమెకు 90 ఏళ్లు కాగా వయోభారంతో కొన్నేళ్లుగా పాటలు పాడటం ఆపేశారు లత మంగేష్కర్.