English   

వరుసగా రెండో తెలుగు సినిమా ఛాన్స్ దక్కించుకున్న శ్రీ రెడ్డి

srieddy
2019-11-12 05:36:12

ఎన్నో రకాల ప్రయోగాలు ఎన్నో వివాదాల అనంతరం వివాదాస్పద నటి శ్రీ రెడ్డికి ఒక తెలుగు సినిమా అవకాశం వచ్చింది. డ్రీమ్‌ అనే సినిమాతో ఏడు ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో అవార్డులు ద‌క్కించుకున్న భ‌వానీ శంక‌ర్ ద‌ర్శక‌త్వంలో తాజాగా రూపొందుతోన్న క్లైమాక్స్ అనే సినిమాలో ఆమెకి అవకాశం దొరికింది. క్రైమ్ థ్రిల్లర్ జోన‌ర్‌లో ఈ చిత్రం రూపొందుతోన్న ఈ సినిమాలో శ్రీరెడ్డి నిజ జీవిత పాత్రను పోషిస్తున్నారు. ఆ మూవీ షూటింగ్ కి సంబందించిన స్టిల్స్ సోషల్ మీడియాలో విడుదల అయ్యాయి.

రాజేంద్ర ప్రసాద్ తెల్లని గడ్డం జుట్టుతో ఉండగా, 30ఇయర్స్ పృథ్వీ స్వామీజీ గెటప్ లో కనిపిస్తున్నారు. ఇక ఈ పిక్స్ లో డాన్స్ మాస్టర్ శివశంకర్ కూడా ఉండటం విశేషం. ఈ మూవీ చిత్రీకరణ చివరి దశకు చేరుకుందని సమాచారం. మరోవైపు శ్రీరెడ్డి.. రామ్ గోపాల్ వర్మ నిర్మాణంలో తెరకెక్కుతున్న ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాలో కూడా తన నిజ జీవిత పాత్రనే చేస్తున్నట్టు సమాచారం. పవన్ కళ్యాణ్ ని తిట్టడంతో అప్పట్లో ఆమె సంచలనం రేపింది.

 

More Related Stories