English   

వైభవంగా జరిగిన టాలీవుడ్ నటి అర్చన సంగీత్..

Archana Marriage
2019-11-12 09:52:55

తెలుగమ్మాయి అర్చన ఇంట పెళ్లి సందడి మొదలైంది. బిజినెస మ్యాన్ జగదీష్‌తో నటి అర్చన వివాహం చాలా రోజుల కిందే కన్ఫర్మ్ అయింది. ఇక ఇఫ్పుడు వీళ్ళ సంగీత్ ఘనంగా జరిగింది. నవంబర్ 13న సాయంత్రం వివాహ రిసెప్షన్ జరగనుండగా.. 14వ తేదీ తెల్లవారుజామున 1.30 గంటలకు పెళ్లి ముహూర్తం ఖరారు చేసారు పెద్దలు. ఈ నేపథ్యంలో నవంబర్ 11 రాత్రి సంగీత్ ఘనంగా నిర్వహించారు. పెళ్లి వేడుక జరిగే గచ్చిబౌలిలోని కొల్లమాధవరెడ్డి గార్డెన్‌లో సంగీత్ కార్యక్రమాన్ని ఆటపాటల నడుమ సందడిగా జరిగింది. దీనికి వధువరులు అర్చన, జగదీష్ సినిమా పాటలకు స్టెప్పులేస్తూ కార్యక్రమాన్ని మరింత హుషారెత్తించారు. అర్చన స్నేహితులైన శివబాలాజీ, మధుమిత దంపతులు కూడా ఈ కార్యక్రమంలో వధూవరులతో పాటు ఆడిపాడారు. ఎంతో ఘనంగా జరిగిన సంగీత్ కార్యక్రమంలో అర్చన, జగదీష్ తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు పాల్గొన్నారు. వాళ్లతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా వచ్చి కాబోయే నూతన వధూవరులను ఆశీర్వరించారు. ఈ మధ్య సినిమాలకు పూర్తిగా దూరమైంది అర్చన. ఆ తర్వాతే పెళ్లి చేసుకుంటుంది. 

More Related Stories