English   

బోయపాటికి ముందే కనిపిస్తున్న చుక్కలు..

 Boyapati Srinu
2019-11-12 13:45:31

ఒకే ఒక్క ఫ్లాప్ సినిమా బోయపాటి శ్రీను కెరీర్ ను పూర్తిగా మార్చేసింది. అంతకుముందు వరకు ఆయన చెప్పిందే వేదం అన్నట్లు ఉండేది. కానీ రామ్ చరణ్ తో తెరకెక్కించిన వినయ విధేయ రామ సినిమా దారుణంగా డిజాస్టర్ కావడంతో బోయపాటి శ్రీను ఇమేజ్ పడిపోయింది. దాంతో ఇప్పుడు హీరోలు చెప్పినట్లుగా బోయపాటి వినాల్సి వస్తుంది. వినయ విధేయ రామ సినిమాకు భారీ బడ్జెట్ పెట్టించడమే కాకుండా నష్టాలు కూడా భారీగానే తీసుకొచ్చాడు బోయపాటి. దాంతో ఇప్పుడు బాలకృష్ణ సినిమా బడ్జెట్ కష్టాలు మొదలయ్యాయి. 

ఈ సినిమాను 70 కోట్లతో తెరకెక్కించాలని సన్నాహాలు చేసుకున్నాడు బోయపాటి శ్రీను. నిజానికి బోయపాటి శ్రీను సినిమాను తానే నిర్మిస్తానని ఆఫీసియల్ గా ప్రకటించాడు బాలకృష్ణ. కానీ వినయ విధేయ రామ ఫ్లాప్ కావడం ..దానికి తోడు తాను నిర్మించిన ఎన్టీఆర్ బయోపిక్ కూడా డిజాస్టర్ కావడంతో నిర్మాణం తనకు అచ్చి రాలేదని వెనక్కి తగ్గాడు బాలయ్య. దాంతో ఈ ప్రాజెక్టులోకి మిర్యాల రవీందర్ రెడ్డి వచ్చాడు. ఈయన గతంలో బోయపాటి దర్శకత్వంలో జయ జానకి నాయక సినిమా నిర్మించాడు. బాలయ్య సినిమా కోసం దాదాపు 60 కోట్ల బడ్జెట్ అడుగుతున్నాడు. కానీ నిర్మాత మాత్రం అంత పెట్టలేనని చేతులు ఇట్టేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు 50 కోట్లకు మించి ఒక్క రూపాయి కూడా పెట్టకూడదని బాలకృష్ణ కూడా ఆర్డర్ వేశాడని ప్రచారం జరుగుతుంది. 

అందుకే బోయపాటి ప్రస్తుతం స్క్రిప్టు మార్చే పనిలో బిజీగా ఉన్నాడు. డిసెంబర్ 20న రూలర్ సినిమాతో బాలకృష్ణ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అది విడుదల అయ్యేలోపు బోయపాటి కథ సిద్ధం చేసుకొని.. బడ్జెట్ కంట్రోల్ చేసుకోవాల్సిందిగా బాలయ్య సూచించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై ఈ మాస్ దర్శకుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. అప్పటివరకు నందమూరి అభిమానులకు ఈ సస్పెన్స్ తప్పదు.

More Related Stories