English   

పార్టీలకు వెళ్తే ఆఫర్లు వస్తాయా.. రకుల్ సూటి ప్రశ్న..

Rakul Preet Singh
2019-11-12 14:14:57

తెలుగు ఇండస్ట్రీలో రోజుకొక కొత్త హీరోయిన్ వస్తుంది. అందరినీ తట్టుకొని నిలబడాలి అంటే చాలా కష్టం. దానికోసం చాలా చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా హీరోయిన్ అన్న తర్వాత గ్లామర్ మెయింటెన్ చేయడం అనేది కచ్చితంగా ఉండాల్సిన లక్షణం. దానికి తోడు పార్టీలు కూడా చేసుకోవాలి.. అందరితో సన్నిహితంగా ఉన్నప్పుడు అవకాశాలు కూడా వస్తాయి.. ఇదే ఇండస్ట్రీలో తెలిసిన మంత్రం. కానీ ఇది నిజం కాదు అంటుంది రకుల్ ప్రీత్ సింగ్. 

కలిసి పార్టీలు చేసుకున్నంత మాత్రాన దర్శక నిర్మాతలతో సన్నిహితంగా ఉన్నంత మాత్రాన అవకాశాలు వస్తాయి అనుకుంటే అంతకంటే తెలివి తక్కువతనం మరొకటి లేదు అంటుంది రకుల్. హీరోలు తమకు ఎంత మంచి స్నేహితులు అయినా కూడా కథకు ప్రాధాన్యం ఉంటేనే తమకు అవకాశాలు వస్తాయని.. అంతేకానీ కలిసి పార్టీలు చేసుకొని ఎంజాయ్ చేసినంత మాత్రాన అవకాశాలు ఇచ్చేస్తారు అనుకోవడం దారుణం అంటుంది ఈ ముద్దుగుమ్మ. 

ప్రస్తుతం ఈ భామ తెలుగులో ఏమంత బిజీగా లేదుమ్ నితిన్ హీరోగా చంద్రశేఖర్ ఏలేటి తెరకెక్కిస్తున్న చదరంగం సినిమాలో మాత్రం హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో ప్రియా వారియర్ మరో హీరోయిన్. ప్రస్తుతం తెలుగు హిందీ తమిళ ఇండస్ట్రీలపై దృష్టి పెడుతుంది రకుల్ ప్రీత్ సింగ్. కానీ తెలుగులో వ్యాపారాలు చాలానే ఉన్నాయి. హైదరాబాదులో రకుల్ ప్రీత్ సింగ్ కు జిమ్ బిజినెస్ ఉంది. ఇక్కడ ఆమె ఎఫ్ 45 చాలా ఫేమస్. అందుకే ఏ ఇండస్ట్రీ లో నటిస్తున్నా కూడా హైదరాబాద్ లోనే ఎక్కువగా కనిపిస్తుంది రకుల్. ఇక్కడ అవకాశాలు వచ్చినన్ని రోజులు నటించి ఆ తర్వాత ముంబై మకాం మార్చాలని చూస్తోంది ఈ బ్యూటీ.

 తెలుగు ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరితో రకుల్ కు మంచి పరిచయం ఉంది. అయినా కూడా ఇప్పుడు వాళ్ళు ఎవరు ఈమెకు అవకాశాలు ఇవ్వడం లేదు. అందుకే పార్టీలకు వెళ్లినంత మాత్రాన హీరోలతో సన్నిహితంగా ఉన్న అవకాశాలు రావని మొహం మీద చెప్పేస్తుంది ఈ ముద్దుగుమ్మ.

More Related Stories