English   

టెర్రరిస్ట్ సమంతా...షూటింగ్ మొదలు

 Samantha
2019-11-12 15:32:07

సాధారణంగా పెళ్లి తరువాత హీరోయిన్ల కెరీర్‌ స్లో అవుతుంది. కానీ సమంత కెరీర్‌ మాత్రం పెళ్లి తరువాత మరింతగా ఊపందుకుంది. పెళ్లికి ముందు ఎక్కువగా గ్లామర్‌ రోల్స్‌ మాత్రమే చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు ప్రయోగాత్మక పాత్రల్లో మాత్రమే నటిస్తోంది. సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్న సమంత శర్వానంద్ సరసన 96 రీమేక్‌లో నటిస్తోంది. తమిళ్‌లో ఘన విజయం సాధించిన ఈ సినిమాను తెలుగులో పీ ప్రేమ్‌కుమార్‌ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు వెబ్‌ సిరీస్‌లలో నటించేందుకు ఇంట్రస్ట్ చూపిస్తోంది. సమంత కూడా ఓ సక్సెస్‌ఫుల్‌ వెబ్‌ సిరీస్‌తో డిజిటల్‌ రంగంలోకి అడుగుపెట్టేందుకు ప్లాన్‌ చేసుకుంటుంది. 

బాలీవుడ్‌ నటుడు మనోజ్‌ బాజ్‌పాయ్‌, సౌత్‌ బ్యూటీ ప్రియమణి ప్రధాన పాత్రల్లో తెరకెక్కి సక్సెస్‌ అందుకున్న వెబ్‌ సిరీస్‌ ది ఫ్యామిలీ మ్యాన్‌. టెర్రరిజం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సిరీస్‌ తొలి సీజన్‌ ఇటీవల అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలై సూపర్‌ హిట్ అయ్యింది. దీంతో తెలుగు వారయిన మేకర్స్‌ ఇప్పుడు సీజన్‌ 2ను మరింత భారీగా ప్లాన్ చేస్తున్నారు. తొలి సీజన్‌లో నటించిన నటులతో పాటు మరికొంత మంది స్టార్స్‌ను కూడా రెండో సీజన్‌లో నటించనున్నారు. ఈ సీజన్‌లో సమంత నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న టెర్రరిస్ట్ పాత్రలో నటించనుందన్న ప్రచారం జరిగింది. అయితే తాజా సమాచారం ప్రకారం వెబ్ సిరీస్ షూటింగ్ ఇప్పటికే ప్రారంభమవగా త్వరలోనే సమంత షూటింగ్‌లో పాల్గొంటారని సమాచారం.  

More Related Stories