English   

వారికి షాకిస్తూ విజయ్ చందర్ కి పదవి కట్టబెట్టిన జగన్

ap
2019-11-12 19:56:45

ముఖ్యమంత్రి జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల సమయంలో అనేక మంది సినీ ప్రముఖులు జగన్ కు మద్దతుగా ప్రచారం చేశారు. పార్టీకి ముందు నుండి ఉండి నిలబడిన వారికి పదవులను వరుసగా కట్టబెడుతూ వస్తున్న జగన్.ఫిలిం డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ పదవిని సీనియర్ యాక్టర్ విజయ్ చందర్ కు కట్టబెట్టారు. ఈ పదవి కోసం ముందు నుండి అనేక మంది పేర్లు వినిపించాయి. పోసాని, మోహన్ బాబు, ఆలీ వంటి పేర్లు ప్రచారంలోకి వచ్చాయి.

అయితే ఎన్నికల ముందు వచ్చిన వారు కాకుండా పార్టీ ఏర్పాటు చేసిన నాటి నుండి తనతోనే ఉన్న విజయ్ చందర్ కు ఈ పదవి ఇవ్వాలని జగన్ నిర్ణయించి ఆమేరకు ఉత్తరువులు జారీ చేశారు. విజయ్ చందర్ జగన్ పార్టీ ప్రకటన నాటి నుండి ఆయనతోనే వెన్నంటి ఉన్నారు. జగన్ జైలులో ఉన్నప్పుడూ షర్మిళ పాదయాత్ర సమయంలో అలాగే అన్ని రకాల ఎన్నికల ప్రచారాలలో కూడా వైసీపీకి మద్దతుగా ప్రచారం చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ పదవిని అంబికా కృష్ణ నిర్వహించారు. టంగుటూరు ప్రకాశం పంతులు కుటుంబానికి చెందిన విజయ్ చందర్ మొదటి నుండే వైయస్ కుటుంబానికి విధేయుడు.

More Related Stories