English   

త్వరలో షూట్ కి వెళ్లనున్న మెగా హీరో

sai
2019-11-12 20:05:43

వరుస పరాజయాలు ఎదుర్కొంటున్న మెగా హీరో సాయిధరమ్ తేజ్ ఎట్టకేలకు చిత్రలహరితో ఒక మాదిరి హిట్ అందుకున్నాడు. ఇక ఆయన మారుతి దర్శకత్వంలో ‘ప్రతిరోజూ పండగే’లో నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే నెల 20న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇదిలా ఉండగా ఆ తరువాత సినిమాను కూడా సాయిధరమ్ తేజ్ లైన్లో పెట్టాడు. ఆయన తదుపరి సినిమాకు ‘సోలో బ్రతుకే సో బెటర్’ అనే టైటిల్ ను ఖరారు చేశారన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ కు జోడీగా నభా నటేశ్ నటిస్తుండగా, బివిఎస్ఎస్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. నూతన దర్శకుడు సుబ్బు నిక్కీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు. నిన్న ‘సింగిల్స్ డే’ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ లో సాయిధరమ్ తేజ్ లుక్ స్టైలిష్ గా ఉంది. ఇక ఈ సినిమా గత నెలలోనే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఇక ఈ సినిమా మొదటి షెడ్యూల్ ఈ నెల 19 నుండి మొదలు కానుందని అంటున్నారు.  ఇక ఈ సినిమాని వచ్చే వేసవిలో ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

More Related Stories