English   

రెండు దశాబ్దాల తర్వాత క్రేజీ కాంబో

Krishna Vamsi
2019-11-13 09:11:39

సీనియర్ డైరెక్టర్ కృష్ణ వంశీ కొత్త సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. మ‌రాఠీ సినిమా న‌ట‌ సామ్రాట్‌ ను తెలుగులో రంగమార్తాండ‌ అనే పేరుతో రీమేక్ చేస్తున్నారు. రెడ్ బ‌ల్బ్ మూవీ, హౌస్‌ఫుల్ మూవీస్‌, ఎస్వీఆర్ గ్రూప్ బ్యాన‌ర్స్‌పై ఈ సినిమా నిర్మితం కానుంది. 2017లో నక్షత్రం సినిమా త‌ర్వాత కృష్ణ వంశీ డైరెక్ట్ చేయ‌బోతున్న చిత్రమిదే కావడంతో ఈ సినిమా మీద అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్షన్ కార్యక్రమాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఈ సినిమా కృష్ణ వంశీ ప్రాణ స్నేహితుడు ప్రకాష్ రాజ్, భార్య ర‌మ్యకృష్ణ కీల‌క పాత్రలో న‌టిస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం సంగీత దిగ్గజం మేస్ట్రో ఇళయరాజా కృష్ణవంశీ 21 ఏళ్ల తర్వాత కలిసి పని చేయబోతున్నారు. 1998లో కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన అంతఃపురం చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని అందించారు. ఆ సినిమాలోని పాటలు ఇప్పటికీ క్లాసిక్ ఏ. అసలేం గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా.. అనే ప్రణయగీతం యువతరాన్ని విశేషంగా ఆకట్టుకుంది. తాజాగా కృష్ణవంశీ రూపొందిస్తున్న రంగమార్తాండ చిత్రానికి ఇళయరాజా స్వరాలను అందించబోతున్నారని సమాచారం. దైవంగా భావించే ఇళయరాజాతో మరోసారి సినిమా చేస్తుండటం ఆనందంగా ఉందని కృష్ణవంశీ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఇళయరాజా తనను ఫోటో తీస్తున్నట్టున్న ఒక ఫొటోను ఆయన షేర్ చేశారు. ఓ రంగస్థల కళాకారుడి జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. 

More Related Stories