English   

అంధాదూన్ తెలుగు రీమేక్ కి హీరో ఫిక్స్ 

Nithiin
2019-11-13 12:06:21

శ్రీనివాస కల్యాణం భారీ డిజాస్టర్ కావడంతో చాలా రోజులు విశ్రాంతి తీసుకున్న యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్‌లో పెట్టి ఆశ్చర్యపరుస్తున్న ఈ కుర్ర హీరో తాజాగా మరో సినిమా లైన్‌లో పెట్టినట్టు తెలుస్తోంది. హిందీలో ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించి సూపర్‌హిట్ అయిన `అంథాదూన్` తెలుగు రీమేక్‌లో నితిన్ హీరోగా చేయబోతున్నట్టు సమాచారం. నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి ఈ సినిమా హక్కులు తీసుకున్నారని ఈ సినిమాను రీమేక్ చేసే అవకాశం రణరంగం ఫేం దర్శకుడు సుధీర్ వర్మకు దక్కినట్టుగా చెబుతున్నారు. అయితే ఈ వార్తకు సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు కానీ ఇన్సైడ్ ఇన్ఫో ప్రకారం స్క్రిప్ట్ వర్క్ కూడా మొదలయిందట. ఇక ప్రస్తుతం నితిన్ ‘ఛలో’ దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో వస్తోన్న ‘భీష్మ’ సినిమా పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఆ సినిమా తర్వాత చంద్రశేఖర్ యేలేటితో ఒక సినిమా, వెంకీ అట్లూరితో రంగ్ దే సినిమాలు చేస్తున్నాడు.   
 

More Related Stories