English   

ఇంటరెస్టింగ్ సబ్జెక్ట్ మీద తేజ సినిమా 

 Article 370
2019-11-13 12:28:41

బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ జంటగా సీత అనే సినిమాని తెరకెక్కించిన దర్శకుడు తేజ ఆ సినిమా అంతగా ఆకట్టుకొక పోవడంతో కాస్త గ్యాప్ తీసుకున్నాడు. ఆయన తాజాగా ఇంట్రెస్టింగ్ సబ్జెక్టుతో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని అంటున్నారు. అదేంటంటే ఆర్టికల్ 370 రద్దు...అవును మొన్న ఆగష్టులో జరిగిన ఈ ఆర్టికల్ రద్దు అంశం మన దేశంలో ప్రకంపనలు సృష్టించింది. రద్దు వలన జమ్మూ కాశ్మీర్ రెండు ముక్కలుగా విడిపోయింది. అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతాలుగా జమ్మూ- కాశ్మీర్ ఏర్పడగా, అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతంగా లడక్ ఏర్పడింది. ఇప్పుడు ఆర్టికల్ 370 అంశాన్ని తీసుకొని ప్యాన్ ఇండియా లెవెల్ లో సినిమా చేయాలనీ దర్శకుడు తేజ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. నిజానికి ఇలాంటి సినిమలాని అంటే యధార్ద సంఘటనలను బేస్ చేసుకుని సినిమా తీయడం బాలీవుడ్ జనానికి అలవాటు. కానీ వాళ్ళు ఎవరూ ఇంకా దీని మీద ద్రుష్టి పెట్టకుండానే ఇప్పుడు తేజ కర్చీఫ్ వేసేశాడు. ఇక ఇప్పటికే ఆర్టికల్ 15 నేపథ్యంలో సినిమా తెరకెక్కగా, ఈ సినిమా విజయం సాధించింది. చూడాలి మరి ఈ సినిమా ఏమేరకు ఆకట్టుకుంటుందో ?

More Related Stories