English   

మెహర్ రమేష్ కు అదిరిపోయే ఛాన్స్ ఇచ్చిన నమ్రత.. 

 Meher Ramesh
2019-11-13 16:37:55

మెహర్ రమేష్.. తెలుగు ఇండస్ట్రీలో తన పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయన చేసిన అన్ని సినిమాలు ఫ్లాప్ కావడంతో ఐరన్ లెగ్ డైరెక్టర్ అనే పేరు వచ్చేసింది. ఆరేళ్ల కింద వెంకటేష్ హీరోగా వచ్చిన షాడో సినిమా తర్వాత మెహర్ రమేష్ కు మళ్ళీ డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చి ఆలోచన కూడా ఏ హీరో చేయడం లేదు. దాంతో మళ్లీ అసిస్టెంట్ డైరెక్టర్గా మారిపోయాడు మెహర్ రమేష్. దాంతో పాటు కొన్ని యాడ్ ఫిలింస్ షూట్ చేస్తున్నాడు. అన్నింటికి మించి ప్రస్తుతానికి మహేష్ బాబు కుటుంబంతో చాలా సన్నిహితంగా ఉంటున్నాడు మెహర్ రమేష్. ఆయన నటిస్తున్న యాడ్స్ కూడా మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్నాడు. దానికి తోడు పెద్ద దర్శకులు తెరకెక్కిస్తున్న భారీ సినిమాలకు యాక్షన్ ఎపిసోడ్స్ షూట్ చేస్తున్నాడు ఈయన. దర్శకుడిగా అనుభవం ఉండటంతో ఆయనను నమ్మి ఇస్తున్నారు దర్శకులు కూడా. 

ఇదిలా ఉంటే తాజాగా మహేష్ రమేష్ కు మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ ఒక సాయం చేసి పెట్టిందని తెలుస్తోంది. ప్రస్తుతం మహేష్ నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమా గుంటూరు రైట్స్ దగ్గరుండి మరీ మెహర్ రమేష్ కు ఇప్పించిందని ప్రచారం జరుగుతోంది. దీనికి ప్రత్యేకంగా కారణాలు కూడా అవసరం లేదు. కొన్ని రోజులుగా మహేష్ బాబు కుటుంబంతో చాలా సన్నిహితంగా ఉంటున్నాడు మెహర్. బహుశా ఆ కారణంతోనే ఈ దర్శకుడికి నమ్రత సరిలేరు నీకెవ్వరు రైట్స్ ఇప్పించిందని తెలుస్తుంది. 

ఇదిలా ఉంటే మెహర్ రమేష్ తీసుకున్న గుంటూరు అడ్వాన్స్ రూపంలోనే డబ్బులు మొత్తం వెనక్కి వచ్చేశాయని.. రేపు విడుదలైన తర్వాత వచ్చే ప్రతి పైసా కూడా లాభంగా మారిపోనున్నాయని తెలుస్తోంది. సరిలేరు నీకెవ్వరు గుంటూరు రైట్స్ భారీగానే లోకల్ ఎగ్జిబిటర్ లకు అమ్మేశాడు మెహర్ రమేష్. ఈ సినిమాతో మళ్లీ ఈయన జాతకం మారిపోతుందని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. జనవరి 12న విడుదల కానుంది సరిలేరు నీకెవ్వరు. 

More Related Stories