English   

కొడుకు కోసం బాలీవుడ్ హీరోయిన్‌కు షాక్ ఇచ్చిన పూరీ.. 

Ramya Krishna
2019-11-13 18:04:42

కొడుకు ఆకాష్ పూరి కోసం బాలీవుడ్ హీరోయిన్ కు సూపర్ షాక్ ఇచ్చాడు దర్శకుడు పూరీ జగన్నాథ్. ఈయన ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా ఫైటర్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. విజయ్ సినిమాతో పాటే తన కొడుకు రొమాంటిక్ సినిమా పనులను చూసుకుంటున్నాడు పూరి జగన్నాథ్. 

ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ తర్వాత ఈయనలో జోష్ పెరిగిపోయింది. కొడుకు ఆకాష్ నటిస్తున్న రొమాంటిక్ సినిమాకు కథ స్క్రీన్ ప్లే మాటలు పూరి జగన్నాథ్ అందిస్తున్నాడు. అనిల్ పడూరి అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో ఆకాశ్ తల్లిగా బాలీవుడ్ నటి మందిరాబేడీ నటించింది. కానీ షూటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఆమెపై ఉన్న సన్నివేశాలు చూసి పూరీ ఏ మాత్రం సంతృప్తి చెందలేదని తెలుస్తోంది. అందుకే వెంటనే సినిమాలో నుంచి తీసేసి ఆమె స్థానంలో రమ్యకృష్ణను తీసుకున్నాడు ఈ దర్శకుడు. 

ప్రస్తుతం మందిరా బేడీ సన్నివేశాలని రమ్యకృష్ణతో రి షూట్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు దర్శకుడు అనిల్ పడూరి. కచ్చితంగా ఈ సినిమాలో రమ్యకృష్ణ పాత్ర హైలైట్ అవుతుందని నమ్మకంగా చెబుతున్నారు దర్శక నిర్మాతలు. ఆకాష్ కు కూడా రొమాంటిక్ సినిమా కచ్చితంగా విజయం తీసుకొస్తుందని ధీమాగా చెబుతున్నారు వాళ్లు. మొత్తానికి కొడుకు కోసం బాలీవుడ్ హీరోయిన్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు పూరి జగన్నాథ్. ఈ సినిమాలో ముంబై ముద్దుగుమ్మ కేతికా శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. త్వరలోనే సినిమా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పై చాలా విమర్శలు వచ్చాయి. వీపు భాగంలో ఏమీ లేకుండా హీరోయిన్ కేతిక శర్మను చూపించిన విధానంపై మహిళా సంఘాలు కూడా మండిపడ్డాయి. పోస్టర్ లోనే ఇలా ఉంటే సినిమా ఎలా ఉంటుందో అని ప్రేక్షకులు కూడా ఆసక్తిగా వేచి చూస్తున్నారు.

More Related Stories