English   

రాజశేఖర్ నిజంగానే మృత్యుంజయుడు.. గతంలో కూడా..

raj
2019-11-13 18:43:23

రాజశేఖర్ యాక్సిడెంట్ వార్త ఇప్పుడు ఇండస్ట్రీని కుదిపేస్తుంది. దీనిపై ఇప్పటికే ఆయనతో పాటు ఆయన భార్య జీవిత కూడా మీడియాకు సరైన సమాచారం అందించారు. అప్పా జంక్షన్ దాటిన తర్వాత ఔటర్ రింగ్ రోడ్ లో ఈయన కారు బోల్తా పడింది. మేజర్ యాక్సిడెంట్ అయిన కూడా అభిమానుల ఆశీస్సులతో ఆయన క్షేమంగా బయటపడ్డారని చెబుతోంది జీవిత. అయితే రాజశేఖర్ యాక్సిడెంట్ విషయం తెలిసిన తర్వాత అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఎందుకంటే ఈయన ఇలా ఆక్సిడెంట్ బారినపడటం ఇదే మొదటిసారి కాదు.. గతంలో కూడా రెండు మూడు సార్లు రాజశేఖర్ కార్ యాక్సిడెంట్ అయింది. అప్పుడు కూడా క్షేమంగా బయటకు వచ్చాడు. దానికి తోడు మహంకాళి సినిమా షూటింగ్లో మేజర్ ఆక్సిడెంట్ నుంచి బయటపడ్డాడు ఈ సీనియర్ హీరో.

షూటింగ్ చేస్తూ కాలుజారి అలాగే వెనక్కి పడిపోయాడు.. అప్పుడు మొహానికి చేతులకు కాళ్లకు తీవ్రమైన గాయాలయ్యాయి. ఆ ఫోటోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరలే. ఆ తర్వాత ఒకసారి కారు యాక్సిడెంట్ లో క్షేమంగా గాయపడ్డ రాజశేఖర్ మళ్లీ ఇప్పుడు ఇంకోసారి ప్రమాదానికి గురయ్యారు. ఈ హీరో అయితే ఎన్నిసార్లు ప్రమాదపు అంచుల్లోకి వెళ్ళినా కూడా క్షేమంగా బయటకు వస్తుండటం మాత్రం శుభపరిణామం. ఇప్పటి నుంచైనా రాజశేఖర్ చాలా జాగ్రత్తగా ఉండాలి అంటూ విజ్ఞప్తి చేస్తున్నారు అభిమానులు. ప్రస్తుతం ఈయన ఒక తమిళ దర్శకుడితో సినిమా చేస్తున్నాడు.

More Related Stories