English   

అల వైకుంఠపురంలో సాంగ్ లో కనిపించేది వారేనా

allu
2019-11-14 05:28:21

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం “అల వైకుంఠపురములో”. ఈ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా తర్వాత మరే సినిమా లేకపోవడంతో ఈ కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఇక త్రివిక్రమ్ తో మూడోసారి వస్తున్న కాంబినేషన్ కావడంతో ఈ సినిమా మీద సినీ వర్గాల్లో కూడా మంచి అంచనాలున్నాయి. అయితే సంక్రాంతికి రిలీజ్ కానున్న ఈ సినిమా నుండి ప్రమోషన్స్ గట్టిగా చేస్తున్నారు. అలా ఇప్పటి వరకు రెండు సాంగ్స్ కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమా నుండి వచ్చిన ఆ రెండు సాంగ్స్ మంచి రెస్పాన్స్ సాధించింది.

 దీంతో ఇప్పుడు మూడో సాంగ్ కు సంబంధించిన అప్డేట్ ను అధికారికంగా రిలీజ్ చేశారు. ఈ సినిమాలో మూడవ పాట “ఓఎంజి డాడీ” అనే టైటిల్ తో ఉండబోతున్నట్టు తెలిపారు.అంతే కాకుండా ఈ పాట తాలూకా టీజర్ ప్రోమోను రేపు నవంబర్ 14న ఉదయం 10 గంటలకు విడుదల చేయబోతున్నట్టు తెలిపారు. అంతే కాకుండా ఇదే సాంగ్ లో స్పెషల్ గెస్ట్స్ కూడా ఉండబోతున్నట్టు పేర్కొన్నారు. అయితే రేపు ఎలాగో చిల్డ్రన్స్ డే అని ఎవరో గెస్ చేయాలని కోరారు, అయితే అది మరెవరో కాదని అల్లు అర్జున్ తనయుడు అల్లు అయాన్ మరియు కూతురు అల్లు అర్హ ఉంటారని నెటిజన్స్ భావిస్తున్నారు.  

 

More Related Stories