English   

అల్లు వారసుడు వచ్చేసాడు.. బన్నీ కొడుకు డాన్సులు కేక..

Allu Arjun
2019-11-14 15:26:21

అల్లు అర్జున్ పిల్లలు ఇద్దరూ ఇప్పటికే సోషల్ మీడియాలో సూపర్ ఫేమస్. కూతురు అర్హతో ఆడుకుంటూ ఇప్పటికే రెండు మూడు వీడియోలు కూడా పోస్ట్ చేసాడు బన్నీ. అవి వైరల్ అయ్యాయి. ఇక ఇప్పుడు ఏకంగా కొడుకు, కూతురుతో కలిసి తన సినిమాకు ప్రమోషన్ చేస్తున్నాడు బన్నీ. అల వైకుంఠపురములో సినిమాలో ఓ మై గాడ్ డ్యాడీ పాట విడుదలైంది. ఇందులో బన్నీ, పూజా ఎవరూ లేరు. చిల్డ్రన్స్ డే కానుకగా ఇందులో కేవలం బన్నీ పిల్లలు మాత్రమే ఉన్నారు. వాళ్లతోనే సాంగ్ డిజైన్ చేసాడు త్రివిక్రమ్. ఇప్పుడు విడుదలైన ఈ పాట వైరల్ అవుతుంది. ముఖ్యంగా అయాన్ అయితే ఏకంగా తండ్రి మాదిరే డాన్సులు కూడా చేస్తున్నాడు. ఇక అర్హ పాప కూడా క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో కుమ్మేసింది. ఈ పాట పూర్తిగా తెలుగు ర్యాప్ స్టైల్లో ఉంది. ఫుల్ సాంగ్ కచ్చితంగా మరింతగా అలరిస్తుందని చెబుతున్నారు దర్శక నిర్మాతలు. అఆ సినిమాలో మమ్మీ ఈజ్ బ్యాక్ అన్నట్లుగా ఈ పాట పెట్టాడు దర్శకుడు త్రివిక్రమ్. జనవరి 12న విడుదల కానుంది అల వైకుంఠపురములో. 

More Related Stories