English   

ఆ హీరోయిన్‌తో రాసలీలలు నడిపిస్తున్న మంత్రి తనయుడు.. 

Tollywood actress
2019-11-14 15:57:43

తెలుగు ఇండస్ట్రీలో ఎఫైర్స్ అనేవి కామన్. ఒక్క తెలుగు అనే కాదు.. అన్ని ఇండస్ట్రీలలో జరుగుతుంటుంది. ఇక ఇఫ్పుడు కూడా ఇలాంటి ఓ ఎఫైర్ గురించి వార్తలు బయటికి వస్తున్నాయి. అయితే ఇక్కడ హీరో హీరోయిన్ మధ్య కాదు.. ఏకంగా పొలిటికల్ సినిమాటిక్ రిలేషన్ ఇది. తెలుగు ఇండస్ట్రీకి ఎప్పుడో రకుల్, రాశీ ఖన్నా కంటే ముందు వచ్చి కూడా ఇప్పటికీ స్టార్ కాలేకపోయిన ఓ హీరోయిన్ తో మంత్రి గారి తనయుడు రాసలీలలు సాగిస్తున్నాడనేది వార్త. ఇప్పటికే వాళ్లు పబ్బుల్లో, క్లబ్బుల్లో కనిపిస్తూనే ఉన్నారని ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం జరుగుతుంది. 

ఈ ఏడాది ఓ చిన్న సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. అవకాశాల వేటలో మాత్రం ఎప్పట్లాగే వెనకబడింది. ఆ సినిమాలో మరో నటుడితో కలిసి రేప్ సీన్స్ తో పాటు హాట్ సీన్స్ కూడా బాగానే చేసింది. అయినా కూడా దర్శక నిర్మాతలు ఈమెపై కరుణ చూపించలేదు కానీ ఈ హీరోయిన్ పై మంత్రి తనయుడు మాత్రం మనసు పారేసుకున్నాడు. అది లవ్వో.. లస్టో అర్థం కావడం లేదు కానీ ప్రస్తుతం వీళ్లు మాత్రం రాసలీలల్లో మునిగి తేలుతున్నాడని ప్రచారం జరుగుతుంది. ఈ ఇద్దరి వ్యవహారం కారణంగా ఆమె పేరు ప్రస్తుతం రాజకీయాల్లో కూడా బాగానే వినిపిస్తుంది. 

ఓ కామన్ ఫ్రెండ్ నుంచి ఆ ముద్దుగుమ్మతో పరిచయం పెంచుకున్న ఆయన.. తర్వాత ఆమె మోజులో పడిపోయాడని.. స్నేహితులు చెబుతున్నా కూడా ఆ హీరోయిన్ తో తరుచు కలుస్తూ బయటికి వెళ్తున్నాడని తెలుస్తుంది. అన్నట్లు ఆ మధ్య ఈ హీరోయిన్ గారు ఓ మెగా హీరోతో డేటింగ్ కూడా చేసిందనే వార్తలున్నాయి. ఈ మధ్యే పెళ్లి చేసుకుంటుందనే వార్తలు వచ్చినా కూడా అవన్నీ అబద్ధాలే అని తోసిపుచ్చింది. మరి వీరి లస్ట్ స్టోరీ ఎన్నాళ్లు సాగుతుందో చూడాలిక. 
 

More Related Stories