English   

అన్నింటికీ ఓకే కానీ ఆ ఒక్కటి వద్దంటున్న తమన్నా.. 

Tamannaah
2019-11-14 16:47:17

త‌మ‌న్నా మ‌రోసారి హీట్ పెంచేసింది. ఈ మ‌ధ్య ఎక్క‌డికి వ‌చ్చినా కూడా అంద‌మే ఆయుధంగా వాడేస్తుంది త‌మ‌న్నా. అప్ప‌ట్లో ఐఫా ఉత్స‌వంలో ఈమె ఉల్లిపొర లాంటి డ్ర‌స్సుతో చేసిన ర‌చ్చ ఇప్ప‌టికీ అంద‌రికీ గుర్తుండే ఉంటుంది. ఆ త‌ర్వాత కూడా చాలా ఈవెంట్స్ లో ఊపిరి ఆగిపోయే అందాల ప్ర‌ద‌ర్శ‌న‌తో రెచ్చ‌గొట్టింది త‌మ‌న్నా. ఇక విశాల్ యాక్షన్ సినిమా కోసం బికినీ కూడా వేసింది తమన్నా. ఈ సినిమాలో త‌మ‌న్నా ప‌ట్టించిన చెమ‌ట‌ల గురించి ప్ర‌త్యేకంగా చెప్పాలా..? ఇలా ఒక్కోసారి ఒక్కో విధంగా ఊపిరి ఆపేస్తోన్న త‌మ‌న్నా.. ఇప్పుడు మరోసారి రెచ్చిపోయింది. న‌డుము సోయ‌గాలు చూపిస్తూ నిద్ర చెడ‌గొడుతుంది. యాక్షన్ సినిమా పోస్టర్స్ లో తమన్నా సొగసులు చూస్తుంటే ఔరా అనిపించక మానదు. 

అయితే ఇక్కడే మరో విషయం కూడా చెప్పింది తమన్నా. తనకు హాట్ సీన్స్ చేయడం ఇష్టం ఉండదని చెబుతుంది. కావాలంటే గ్లామర్ షో ఎంతైనా చేస్తాను కానీ హాట్ సీన్స్ చేయడమన్నా.. లిప్ లాక్ సన్నివేశాలు చేయడం అన్నా తనకు అస్సలు నచ్చదని చెబుతుంది తమన్నా. ఇప్ప‌టి వ‌ర‌కు ఒక లెక్క‌.. ఇప్ప‌ట్నుంచీ ఒక లెక్క అన్నంత‌గా రెచ్చిపోయింది ఈ బ్యూటీ. కేవ‌లం న‌డుము మాత్ర‌మే చూపిస్తూ త‌మ‌న్నా చేసిన హంగామాకు అక్క‌డున్న వాళ్ల మ‌తులు చెడిపోయాయంతే. బాలీవుడ్ లోనూ త‌మ‌న్నా హొయ‌లు క‌నిపిస్తున్నాయి. మొత్తానికి త‌మ‌న్నా అందాలు ఇప్పుడు నేష‌న‌ల్ వైడ్ హాట్ టాపిక్ అయిపోయాయి. 

More Related Stories