English   

రానా విరాటపర్వం యూనిట్ లో గొడవ 

Virata Parvam
2019-11-14 17:42:13

నీది నాదీ ఒకే కధ ఫేం వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా, సాయిపల్లవి కాంబినేషన్లో విరాటపర్వం 1992 అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే ఒకటి రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో రానా పొలిటికల్ లీడర్ గా.. సాయి పల్లవి నక్సలైట్ అని అంటూ రకరకాల ప్రచారాలు అయితే జరుగుతున్నాయి. ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తోన్న దివాకర్ మణితో దర్శకుడికి పాడడం లేదని సమాచారం. ప్రాజెక్ట్ నుండి దివాకర్ మణిని తప్పించి ఆయన స్థానంలో రాజు తోటని తెచ్చుకోవాలని వేణు ఊడుగుల ప్లాన్ చేస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. రాజు తోట, వేణు ఊడుగుల గతంలో 'నీదీ నాదీ ఒకే కథ' అనే సినిమాకి పని చేశారు. అయితే ఈ ప్రచారం సంగతి అటుంచితే దివాకర్ మణి డేట్స్ కుదరక పోవడం వలెనే తప్పుకున్తున్నారని సమాచారం. ఇక ఆయన ప్లేస్ లో మహానటి సినిమాకి పని చేసిన డేనియల్ ని తీసుకుంటున్నారని చెబుతున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్ సగం వరకు పూర్తయింది. ఈ సమయంలో సినిమాటోగ్రాఫర్ ని తప్పించి మరొకరిని తీసుకోవడమంటే అవుట్ పుట్ విషయంలో తేడాలు వచ్చే అవకాశం ఉండచ్చు. 

More Related Stories