English   

కాజల్ మళ్లీ రెచ్చిపోయిందోచ్.. చిన్నగౌనుతో పెద్దపాప.. 

 Kajal Agarwal
2019-11-14 17:57:11

కాజ‌ల్ అగ‌ర్వాల్.. సౌత్ ఇండ‌స్ట్రీలో ప‌రిచ‌యం అక్క‌ర్లేని హీరోయిన్. ముంబై నుంచి వ‌చ్చినా కూడా అక్క‌డ మాత్రం అంత‌గా గుర్తింపు తెచ్చుకోలేదు ఈ ముద్దుగుమ్మ‌. సింగం, స్పెష‌ల్ ఛ‌బ్బీస్ లాంటి విజ‌యాల త‌ర్వాత కూడా కాజ‌ల్ ను ప‌ట్టించుకున్న పాపాన పోలేదు బాలీవుడ్ ద‌ర్శ‌క‌నిర్మాత‌లు, హీరోలు. దాంతో అమ్మాయిగారు హాయిగా సౌత్ ట్రైన్ ఎక్కేసారు. కానీ మ‌న‌సు ఊరికే ఎందుకుంటుంది..? ఎలాగైనా బాలీవుడ్ లో జెండా పాతాల‌నో ఏమో కానీ ఇప్పుడు అందాల ఆర‌బోత‌కు తెర తీస్తుంది ఈ చంద‌మామ‌. ఎంత‌లా అంటే ఇప్ప‌టి వ‌ర‌కు మ‌నం చూసిన కాజ‌ల్ కాకుండా మ‌రో కొత్త కాజ‌ల్ మ‌న‌కు క‌నిపిస్తుంది ఇప్పుడు. 

ఆ మ‌ధ్య ఓసారి ఫిల్మ్ ఫేర్ లో అదిరిపోయే హాట్ షోతో మ‌తులు పోగొట్టిన ఈ భామ‌.. ఇప్పుడు మ‌రోసారి అదే రేంజ్ లో క్లీవేజ్ షో చేస్తూ రెచ్చిపోయింది. చంద‌మామ హాట్ షో ఇప్పుడిప్పుడే హ‌ద్దులు దాటేస్తోంది. ఈ మధ్య వరస సినిమాలు చేస్తూ బిజీగా అయిపోయింది కాజల్. షూటింగ్ గ్యాప్ చిక్కినపుడు ఇలా చక్కగా ఫోటోషూట్స్ చేస్తుంది ఈ చందమామ. తాజాగా చిన్నగౌను వేసుకుని మంచి పోజిచ్చింది ఈ పెద్దపాప. ఇది చూసి అంతా ఫిదా అయిపోతున్నారు. ప్రస్తుతం భారతీయుడు 2తో పాటు మరిన్ని సినిమాల్లో కూడా నటిస్తుంది కాజల్. ఈ సినిమాల్లో కాజల్ గ్లామర్ స్పెషల్ అట్రాక్షన్ కానుంది. మొత్తానికి ఈమె అందాల ఆర‌బోత చూస్తుంటే మ‌రో రెండు మూడేళ్ల పాటు ఇండ‌స్ట్రీలోనే హీరోయిన్ గా ఉండాల‌ని ఫిక్సైపోయింది. 

More Related Stories