అమైరా దస్తూర్ అందాల దస్తూరి.. అవకాశాలు చేజారి..

అమైరా దస్తూర్.. ఈ మధ్యే తెలుగు ప్రేక్షకులను పలకరించిన అందం. మనసుకు నచ్చింది అంటూ వచ్చింది కానీ సినిమా మాత్రం ప్రేక్షకుల మనసుకు నచ్చలేదు. కానీ ఈ అమ్మడి అందం మాత్రం బాగానే నచ్చింది. అందుకే ఇక్కడే సెటిల్ అయిపోవాలని చూస్తుంది. అందుకే అందాల ఆరబోతనే ఎక్కువగా నమ్ముకుంటుంది ఈ ముద్దుగుమ్మ. అనుకున్నదే తడువుగా అమ్మడు రచ్చ మొదలుపెట్టేసింది. కావాలంటే పైన ఉన్న ఫోటో ఒక్కసారి చూడండి.. అందులో కొంటెగా తినేసేలా ఎలా చూస్తుందో..? అప్పట్లో ఆ మధ్య రామ్ చరణ్ ధృవ సినిమాలో ముందు ఈ భామనే అనుకున్నారు కానీ సెట్ కాలేదు.
ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు అనుకున్నా ఏదీ సెట్ కాలేదు. దాంతో సందీప్ తో సర్దుకుపోయింది. తమిళనాట ఈ భామ ధనుష్ తో నటించిన అనేగన్ మంచి విజయమే సాధించింది. అయినా గానీ అమైరా దస్తూర్ ను ఎందుకో మన దర్శకులు, హీరోలు పట్టించుకోవడం లేదు. పైగా బాలీవుడ్లో ముద్దుల వీరుడు ఇమ్రాన్ హష్మీతో నటించిన మిస్టర్ ఎక్స్ కూడా ఫ్లాపవడంతో.. చిన్న సినిమాలు చేసుకుంటుంది అమైరా. మధ్యమధ్యలో ఇదిగో ఇలా హాట్ ఫోటోషూట్స్ తో దర్శకుల మదిలో పడటానికి ప్రయత్నాలు చేస్తుంది. మరి ఈ భామ అందాల ఆరబోత చూసిన తర్వాతైనా ఏ దర్శకుడైనా కరిగిపోతాడేమో చూడాలి.