English   

ప్రభాస్ వదులుకున్న హిట్ సినిమాలేంటో తెలుసా 

Prabhas
2019-11-14 19:14:39

కొన్ని కొన్ని సినిమాలు అనుకోని కాంబినేషన్ లో తెరకెక్కుతాయి. అయితే కొన్ని కొన్ని సూపర్ హిట్ సినిమాలను కూడా హీరోలు వదులుకున్న సందర్భాలు ఉన్నాయి. తాను వదులుకున్న కథను మరో హీరో చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొడితే అయ్యో అని అనుకోడం తప్ప ఇంకేమీ చేయలేని పరిస్థితి. తెలుగులో అలాంటి సినిమాలు మిస్ అయిన హీరోలు, కథ నచ్చకో .. కథ చెప్పినప్పుడు మరో మూడ్ లో ఉండో వదులుకున్న సినిమాలు చాలానే ఉన్నాయి. అందులో ప్రభాస్ అయితే మరీ దారుణం ఏకంగా ఏడెనిమిది సినిమాలు వదులుకుంటే అవన్నీ హిట్ అయ్యి కూర్చున్నాయట. ఒకసారి అవి ఏమిమి సినిమాలో చూద్దాం.
 
ఒక్కడు సినిమా మహేశ్ ను స్టార్ ని చేసింది. అయితే ఈ సినిమా కథను అప్పటికే ఈశ్వర్ సినిమాతో లాంచ్ అయి ఉన్న ప్రభాస్ కి నిర్మాత యం.ఎస్.రాజు దర్శకుడు గుణశేఖర్ వినిపించారట. అయితే వారు రిజక్ట్ చేశారట. నితిన్ కి హిట్ ఇచ్చిన దిల్ సినిమా కధ కూడా ముందు ప్రభాస్ దగ్గరకే వెళ్ళగా రెండో సినిమా పట్టాలెక్కించిన ప్రభాస్ దిల్ ను లైట్ తీసుకున్నాడట. అలాగే ఎన్టీఆర్ ని మరో రేంజ్ కి తీసుకెళ్ళిన సింహాద్రి కథను ముందు ప్రభాస్ కే చెప్పాడట. కానీ ఈ సినిమాని చెప్పినంత బాగా రాజమౌళి తీయగలడా అని అలోచించి ప్రభాస్ రిజెక్ట్ చేసాడట. 

అల్లు అర్జున్ కెరీర్ ను మార్చిన ఆర్య కథను ప్రభాస్ కు వినిపిస్తే తాను సూట్ కానేమో నని రిజక్ట్ చేశారట. ప్రభాస్ కు 'మున్నా' వంటి ప్లాప్ ఇచ్చిన వంశీ పైడిపల్లి బృందావనం కథ వినిపిస్తే అప్పటికే 'డార్లింగ్' 'మిస్టర్ పర్ఫెక్ట్' లాంటి సేమ్ కధలు ఒప్పుకోవడంతో ఆ సినిమా వదులుకున్నాడు ప్రభాస్. ప్రభాస్ కోసమే నాయక్ సినిమా కథను సిద్దం చేశాడట వినాయక్. కానీ రెబల్, మిర్చి సినిమాల డేట్స్ కుదరక ఈ సినిమాని ప్రభాస్ మిస్సయ్యాడు. రవితేజ మార్కెట్ ను డబుల్ చేసిన కిక్ కథని మొదట ప్రభాస్ వద్దకే వెళ్ళిందట. ప్రభాస్ డిసైడ్ అయ్యే లోపే అప్పటికి రవితేజ పిచ్చ ఫామ్లో ఉండడంతో సురేందర్ రెడ్డి రవితేజ ను ఫైనల్ చేసుకున్నాడు. డాన్ శీను కధను కూడా ముందు ప్రభాస్ కి చెప్పారట. అయితే బుజ్జిగాడు సినిమాతో ఈ సినిమాలోని కార్యెక్టర్ లానే అనిపించడంతో చేయలేనని చెప్పాడట.

More Related Stories