English   

ఆ సినిమాని అంత సీక్రెట్ గా ఎందుకు మొదలు పెట్టారో

sai
2019-11-14 19:58:54

మన ఇండస్ట్రీలో నాన్నను చూసో, పెదనాన్నను చూసో ఎవరూ అవకాశాలివ్వరు. కేవలం అది లాంచింగ్ కు మాత్రమే ఉపయోగపడుతుంది. సాయి కుమార్ తనయుడు ఆదికి హీరోగా లాంచింగ్ బాగా కుదిరింది. ప్రేమ కావాలి సినిమా ద్వారా ఆదికి భారీ లాంచింగ్ దొరికింది. ఆ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆది తర్వాత లవ్లీ చిత్రం ద్వారా మరొక హిట్ ను త్వరగానే అందుకున్నాడు. కానీ ఆ తర్వాత నుండి ఆది కెరీర్ ఏమాత్రం బాలేదు. వరసగా ప్లాపులు ఎదరవుతూనే ఉన్నాయి. ఒకటి తర్వాత ఒకటిగా వచ్చిన ఈ ప్లాపులతో ఆది కెరీర్ పూర్తిగా దెబ్బతింది.  రీసెంట్ గా ఆది నటించిన సినిమాలైతే మరీ ఘోరం.

బుర్రకథ, జోడి, ఆపరేషన్ గోల్డ్ ఫిష్ సినిమాలు దారుణంగా దెబ్బతిన్నాయి.  ప్రస్తుతం ఆది చేతిలో సినిమాలు కూడా లేవు. డజనుకు పైగా ప్లాపులు ఇచ్చిన ఆదిని నమ్మి నిర్మాతలు డబ్బులు పెట్టడానికి ముందుకు వస్తారని ఊహించలేం. కానీ అనూహ్యంగా ఆయన హీరోగా ఒక సినిమా మొదలయిపోయింది అది కూడా చాలా రహస్యంగా. జయజానకి నాయక ప్రొడ్యూసర్ మిరియాల రవీందర్ రెడ్డి సోదరుడు నిర్మాతగా ఆది హీరోగా ఒక సినిమా షూటింగ్ కూడా  మొదలు పెట్టేశారని సమాచారం. ఈ సినిమాలో ఈషా రెబ్బా హీరోయిన్ గా నటించనుందని అంటున్నారు. మరి ఈ సినిమాని ఇంత సీక్రెట్ గా ఎందుకు మొదలు పెట్టారో మరి ?

More Related Stories