English   

కొత్త దర్శకుడికి ఒకే చెప్పిన నాని

Nani
2019-11-15 11:42:18

నాని ప్రస్తుతం ఇంద్రగంటి మోహన్‌ కృష్ణ దర్శకత్వంలో ‘వి’ సినిమాలో నటిస్తున్నారు. సుధీర్‌బాబు, నివేదా థామస్, అదితీరావ్‌ హైదరీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా తర్వాత ‘నిన్ను కోరి’ ఫేమ్‌ శివ నిర్వాణతో నాని సినిమా ఉంటుందని వార్తలు వినిపించాయి. అయితే నాని తన తదుపరి సినిమా శ్రీకాంత్ అనే కొత్త దర్శకుడితో చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఒకప్పుడు సుకుమార్ వద్ద పని చేసిన శ్రీకాంత్ తన స్క్రిప్ట్‌తో నానిలోని నటుడిని ఆకట్టుకున్నాడని అందుకే నాని కూడా ఓకే చెప్పాడని అంటున్నారు. ఈ సినిమాని సుధాకర్ చెరుకూరి నిర్మించనున్నారని అంటున్నారు. ఈ సినిమా ఇప్పటి వరకు నాని చేయని జోనర్‌లో ఉండబోతుందని అంటున్నారు. అయితే ‘వి’ అనే సినిమాలో నటిస్తున్న నాని ఈ సినిమా చిత్రీకరణ పూర్తైన తర్వాత నూతన దర్శకుడితో చేస్తాడా? అనే ప్రశ్నకు సమాధానం తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

More Related Stories