వెంకీ కుడుముల అప్పుడే మూడో సినిమా

తొలి సినిమా ‘ఛలో’తోనే దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు వెంకీ కుడుముల. ఆయన రెండో సినిమాగా ప్రస్తుతం నితిన్ కథానాయకుడుగా ‘భీష్మ’ అనే చిత్రం తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. అయితే తాజాగా వెంకీ మూడో సినిమా గురించి ఒక ఆసక్తికర వార్త టాలీవుడ్ సర్కిల్స్ లో సర్క్యులేట్ అవుతోంది. అదేంటంటే ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వెంకీతో ఓ సినిమా నిర్మించేందుకు సిద్ధమైందని అంటున్నారు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌లో ఒక కుర్ర హీరో నటించబోతున్నట్లు సమాచారం. త్వరలోనే వెంకీ కుడుముల, మైత్రీ మూవీ మేకర్స్ ప్రాజెక్ట్ మీద అధికారిక ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తోంది. జాయింట్ వెంచర్‌పై క్లారిటీ వచ్చే అవకాశముంది. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్న ‘భీష్మ వచ్చే ఏడాది ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.