English   

దీనావస్థలో చిరు మొదటి సినిమా డైరెక్టర్

chiru
2019-11-15 14:27:44

మెగాస్టార్‌ చిరంజీవి తొలిచిత్రం ‘పునాదిరాళ్లు’ దర్శకుడు గూడపాటి రాజ్‌కుమార్‌ (75) మంచాన పడ్డారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సినిమాల్లో పెద్దగా సంపాదించక పోవడం వలన ఇప్పుడు ఆయన ఆదుకునే వారి కోసం ఎదురుచూస్తున్నారు. నిజానికి ఆ సినిమా చిరంజీవికే కాక ఆయనకు కూడా మొదటి సినిమానే అయినా ఆ మొదటి ప్రయత్నంలోనే 5 నంది అవార్డులు అందుకొని రాజ్‌కుమార్‌ తన ప్రతిభను చాటుకున్నారు. ఆ తర్వాత కూడా ఆయన తీసినవి కొన్ని సినిమాలే అయినా అవన్నీ సామాజిక సమస్యల మీదనే ఉన్నాయి. అయితే సినిమాలు తీసి చితికిపోయిన ఆయన  ఎవరైనా సాయం చేస్తారేమోనని ఆశతో ఎదురుచూస్తున్నారు. కొడుకు అనారోగ్యంతో మృతి చెందడం, ఆ తర్వాత భార్య కాలం చేయడంతో ఒంటరివాడయ్యాడు.  మెగాస్టార్‌ ని పరిచయం చేసిన ఆయన తానూ మాత్రం స్టార్ కాలేక పోయాడు. ఇండస్ట్రీలో ఎంతో మందిని ఆదుకున్న చిరంజీవి ఈయనను కూడా ఆదుకుంటారేమో చూడాలి. 

More Related Stories