English   

రెండు సినిమాలు లైన్ లో పెట్టిన కళ్యాణ్ రామ్

kalyan
2019-11-16 07:20:12

ప్రస్తుతం కల్యాణ్‌ రామ్‌ సతీష్‌ వేగ్నేశ దర్శకత్వంలో ‘ఎంత మంచివాడవురా!’ చేస్తున్న సంగతి తెలిసిందే. జనవరి 15న సంక్రాంతికి తెరపైకి వస్తున్న ఈ సినిమా తర్వాత ఆయన చేయబోయే సినిమాకి ఆసక్తికర లైన్ అనుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. అదేంటంటే అప్పుడెప్పుడో బాలకృష్ణ చేసిన ఆదిత్య 369 సినిమా తర్వాత మళ్ళీ తెలుగులో టైమ్ మెషీన్ కాన్సెప్ట్ తో సినిమా రాలేదు. ఇప్పుడు అలాంటి సినిమానే కళ్యాణ్ రామ్ చేయబోతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. నిజానికి కళ్యాణ్ రామ్ మల్లిడి వేణు అనే నూతన దర్శకుడి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నట్టు గతంలో గట్టిగా ప్రచారం జరిగింది.

ఈ సినిమా అదే నని అంటున్నారు. ఆదిత్య సినిమాలో లానే ఇది 500 ఏళ్లకి ముందు కథ 500 ఏళ్ల తరువాత కథగా ఈ సినిమా సాగుతుందని అంటున్నారు. భారీ బడ్జెట్ తోనే ఈ సినిమాను పట్టాలెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. ఇక మరో పక్క దర్శకుడు కె.వి. గుహన్‌ తెరకెక్కించిన 118 సినిమా మంచి విజయం అందుకుంది. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా మరో చిత్రాన్ని రూపొందించే ఆలోచనలో ఉన్నాడట గుహన్. దర్శకుడు గుహన్‌. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నాయని అంటున్నారు. అంటే కళ్యాణ్ రామ్ రెండు సినిమాలు లైన్ లో పెట్టినట్టే. మరి ఇది ఎంత వరకూ నిజమో ఆయా సినిమాల ప్రకటనలు వస్తే కానీ చెప్పలేం.

More Related Stories